రాష్ట్రీయం

దేశాభివృద్ధికి కృషిచేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ: ప్రపంచీకరణ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా వ్యాపార, వాణిజ్య రంగాలలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఛార్టర్డ్ అకౌంటెంట్స్ మరింత అవగాహనతో మెలగాలని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు గవర్నర్ కె రోశయ్య పిలుపునిచ్చారు. గ్లోబలైజేషన్‌లో డైనమిజం అవసరమని, దేశ ఆర్థిక విధానాలపై సిఎలు పూర్తి అవగాహన కలిగివుండాలన్నారు. కాకినాడలోని ‘ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఛార్టెర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా’ కార్యాలయంలో భారత మాజీ రాష్టప్రతి ఎపిజె అబ్దుల్ కలాం విగ్రహాన్ని మంగళవారం రోశయ్య ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ ఛార్టర్డ్ అకౌంటెంట్స్ గురుతరమైన బాధ్యతలను నిర్వర్తించాల్సి ఉంటుందన్నారు. వృత్తి నైపుణ్యాన్ని నిరంతరం పెంపొందించుకోవాలని సూచించారు. దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అయ్యేందుకు కృషి చేయాలనిసూచించారు. ఎటువంటి ప్రలోభాలకు ఆస్కారం లేకుండా నిష్పక్షపాతంగా పనిచేస్తూ వృత్తి విలువలను కాపాడాలని విజ్ఞప్తి చేశారు. సమర్థవంతమైన ఆర్థిక విధానాలతో ప్రజలు, మదుపుదారుల ప్రయోజనాలు కాపాడాలని కోరారు. దివంగత అబ్దుల్‌కలాం భారత ప్రజలకు స్ఫూర్తిప్రదాతగా నిలిచారన్నారు. విద్యార్థిలోకానికి ఆయన చేసిన సూచనలు శిరోధార్యమన్నారు. కలాం విగ్రహాన్ని రూపొందించిన శిల్పి వడయార్‌ను రోశయ్య ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఐసిఎఐ గౌరవాధ్యక్షుడు ఎం దేవరాజారెడ్డి, సదరన్ ఛైర్మన్ పిఆర్ అరులోలి, కాకినాడ బ్రాంచ్ ఛైర్మన్ ఆనంద్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.