ఆంధ్రప్రదేశ్‌

టిడిపిలోకి ప్రకాశం డిసిసి అధ్యక్షుడు ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు,మే 7: ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కనిగిరి మాజీ శాసనసభ్యుడు ముక్కు ఉగ్రనరసింహరెడ్డి టిడిపిలో చేరేందుకు రంగం సిద్ధంచేసుకుంటున్నారు. ఈమేరకు తన రాజకీయ భవిష్యత్తు వ్యూహంపై అనుచరులతో కనిగిరిలో ఆదివారం ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఆ మేరకు తన అనుచరులకు వర్తమానం అందింది. తన అనుచరులను కాపాడుకునే ప్రయత్నంలో భాగంగానే ఈసమావేశం నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. కొంతమంది అనుచరులను కనిగిరి నియోజకవర్గ శాసనసభ్యుడు కదిరి బాబురావు పార్టీలో చేరారు. దీంతో తన అనుచరులు లేకుండా తన ఉనికికే ప్రశ్నార్ధకంగా మారుతుందని భావించి ముక్కు సమావేశంలో భవిష్యత్తు వ్యూహాన్ని చర్చించనున్నారు.