ఆంధ్రప్రదేశ్‌

మీరాకుమార్‌ను బలపరచండి: రఘువీరా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 11: లౌకిక సిద్ధాంతాలకు ప్రతినిధిగా రాష్టప్రతి ఎన్నికల్లో పోటీచేస్తున్న మీరాకుమార్ అభ్యర్థిత్వాన్ని తెదేపా, వైసిపి, బిజెపి ఎమ్మెల్యేలు బలపరచాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి కోరారు. ఆ మేరకు ఆయా పార్టీలకు ఆయన మంగళవారం లేఖ రాశారు. రాష్టప్రతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి రామనాధ్ కోవింద్‌ను తెలుగుదేశం బలపరచడం ఏపి ప్రయోజనాలు, ప్రజల ఆకాంక్షలకు విరుద్ధమన్నారు. ఈ నిర్ణయంపై పునరాలోచించాలని సూచించారు. కనీసం రాష్ట్రానికి మేలు జరిగే విధంగా ప్రత్యేక హోదాను అమలుపరచాలనే షరతునైనా విధించాలని డిమాండ్ చేశారు.