ఆంధ్రప్రదేశ్‌

15న ఎస్‌ఆర్‌ఎం వర్సిటీ ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూలై 11: రాష్ట్రంలో ప్రతి పేదవాడూ కోరుకునేంత దాకా చదువుకునే వీలు కల్పిద్దాం. విద్య సామాన్యుడి హక్కు అని తెలియజేద్దామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఆర్థిక వెసులుబాటు లేకపోవడంతో దూర ప్రాంతాలకు వెళ్లి చదవలేకపోతున్నామనే ఆవేదన ఏ పేద విద్యార్థిలోనూ రానివ్వకుండా చేద్దామన్నారు. అనంతపురం జిల్లాలో ‘ఎనర్జీ వర్సిటీ’ని ఏర్పాటు చేస్తున్నాం. రాజమండ్రిలో ‘పెట్రోకెమికల్ వర్సిటీ’ని ఏర్పాటు చేస్తాం. రాజధాని అమరావతి విద్యలకు కేంద్రంగా మారుద్దాం. ప్రతి సామాన్యుడికీ ఈ విద్యాలయాల్లో చదువుకునే హక్కును కల్పిద్దాం’ ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈనెల 15న అమరావతిలో ప్రఖ్యాత ఎస్‌ఆర్‌ఎం వర్సిటీ ప్రారంభం కానున్న నేపధ్యంలో మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ సిఎంఓ ప్రత్యేక కార్యదర్శి సతీష్‌చంద్ర, అమరావతి ప్రాంత అభివృద్ధి సంస్థ (సిఆర్‌డిఎ) ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్, కమిషనర్ చెరుకూరి శ్రీ్ధర్, తదితరులతో తన నివాసంలో మంగళవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జూలై 15న ఎస్‌ఆర్‌ఎం వర్సిటీ ప్రారంభోత్సవం గురించి అధికారులు చంద్రబాబుకు వివరించారు. క్రీడల్లోనూ తెలుగు విద్యార్థులు అత్యంత ప్రతిభను కనబరుస్తున్నారని చంద్రబాబు వివరించారు.