ఆంధ్రప్రదేశ్‌

గిరిజన, సెంట్రల్ వర్సిటీలను ఏర్పాటు చేయండి: మంత్రి గంటా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ,జూలై 11: ఆంధ్రాలో ఏపి విభజన చట్ట ప్రకారం గిరిజన విశ్వవిద్యాలయం, సెంట్రల్ యూనివర్సిటీలను ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని రాష్ట్రప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. మంగళవారం నాడు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడును కేంద్ర మంత్రి సుజనా చౌదరి, రాష్ట్ర మానవనరులశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు,ఎంపీ కేసినేని నానిలు కలిశారు. అనంతరం మంత్రి గంటా విలేఖరులతో మాట్లాడుతూ గిరిజన విశ్వవిద్యాలయం, సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటుకు కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖపై ఒత్తిడి తేవాలని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు విజ్ఞప్తి చేసినట్టు పేర్కొన్నారు. తాత్కాలిక భవనాలతో కొనసాగుతున్న కేంద్ర విద్యాసంస్థలకు శాశ్వత భవనాలను నిర్మించాలని, కేంద్రం ఈ విద్యాసంస్థలకు నిధులు కేటాయించాలని కేంద్రమంత్రి వెంకయ్యను కోరినట్టు చేప్పారు. విభజన చట్టలో పేర్కొన్న విధంగా ఆంధ్రాకు 17 కేంద్ర విద్యా సంస్థలు కేటాయించారని పేర్కొన్నారు.17 విద్యాసంస్థలకు 3508 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిందని, అలాగే రాష్ట్ర ప్రభుత్వ వాటాకింద 607 కోట్లు నిధులను విడుదల చేసిందని చెప్పారు.