ఆంధ్రప్రదేశ్‌

గడువులోగా పనులు ప్రారంభించకుంటే ‘పర్యాటకం’ రద్దే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూలై 11: పర్యాటకం పేరిట ప్రభుత్వ భూములు లీజుకు తీసుకుని ఆపైన ఎలాంటి పనులూ చేపట్టకుండా ఉన్న సంస్థల పట్ల ఇక ప్రభుత్వం కఠినంగా వ్యవహరించనుంది. కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడతామంటూ పాలకులను ఒప్పించి రాష్ట్రంలోని పలుచోట్ల వందలాది ఎకరాల భూములను వివిధ ప్రైవేట్ సంస్థలు లీజు రూపంలో తమ పరం చేసుకోగా ఇప్పుడు పర్యాటక శాఖ ఆ అంశాలను పూర్తి స్థాయిలో సమీక్షిస్తోంది. నిబంధనల ప్రకారం నిర్దేశించిన గడువులోపు కార్యకలాపాలు ప్రారంభించకపోయినా, ఒప్పందం ప్రకారం లీజు మొత్తాలను ఆయా కాల వ్యవధులను అనుసరించి చెల్లించకపోయినా సదరు ఒప్పందాన్ని రద్దు చేయటంతోపాటు న్యాయపరమైన చర్యలకు సైతం వెనుకాడటం లేదు. పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శిగా ముఖేష్‌కుమార్ మీనా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ తరహా వ్యవహారాల పట్ల ఒకింత సీరియస్‌గానే స్పందిస్తున్నారు. ఈ క్రమంలోనే విశాఖపట్నం వేదికగా ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంలో రిక్రియేషన్, ఎమ్యూజ్‌మెంట్ పార్క్‌ను ఏర్పాటు చేస్తామని ఒప్పందం కుదుర్చుకుని సంవత్సరాలు గడుస్తున్నా అడుగు ముందుకు వేయని సంస్థపై ప్రభుత్వం వేటు వేసింది. విశాఖకు చెందిన సిటీ ఆఫ్ డెస్టినీ క్లబ్స్, రిసార్ట్స్ సంస్థ 2011 ఫిబ్రవరిలో పర్యాటక అభివృద్ధి పేరిట ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. 2012 ఏప్రిల్‌లో అధికారికంగా స్థలం పొందినప్పటికీ ఎటువంటి కార్యకలాపాలు ప్రారంభించలేదు. మరోవైపు పిపిపి విధానంలో పర్యాటక శాఖకు చెల్లించవలసిన మొత్తాలను సైతం బకాయి పడ్డారు. ఈ విషయంపై ప్రభుత్వం వారితో ఉత్తర ప్రత్యుత్తరాలు నడిపినప్పటికీ, ఎటువంటి ప్రయోజనం లేకపోయింది. ప్రభుత్వం సిటీ ఆఫ్ డెస్టినీ క్లబ్స్, రిసార్ట్స్ సంస్థకు స్థలం స్వాధీనం చేసి ఐదు సంవత్సరాలు ముగిసినా, అక్కడ రిక్రియేషన్, ఎమ్యూజ్‌మెంట్ పరంగా ఎటువంటి పురోగతి లేదు. దీంతో పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి మీనా చర్యలకు ఉపక్రమించారు. కేవలం సిటీ ఆఫ్ డెస్టినీ మాత్రమే కాకుండా ఈ తీరుగా ప్రభుత్వానికి చెందిన విలువైన భూములను పొంది పనులు ప్రారంభించని సంస్థలపై నిరంతర సమీక్షలు నిర్వహిస్తూ వచ్చారు. తొలుత తన శాఖ అధికారులను బకాయిల విషయంలో అలసత్వం కూడదంటూ, పిపిపి సంస్థలకు నోటీసులు జారీ చేయించారు.
సిటీ ఆఫ్ డెస్టినీ క్లబ్స్, రిసార్ట్స్ సంస్థ పలు అంశాల్లో ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఈ సందర్భంగా ముఖేష్‌కుమర్ మీనా తెలిపారు. సకాలంలో లీజు మొత్తాలను చెల్లించకపోవటం, నోటీసులకు అనుగుణంగా ఆ మొత్తాలపై వడ్డీ జమ చేయకపోవటం, సెక్యూరిటీ డిపాజిట్ పరంగానూ స్పష్టత లేకపోవటంతో ఒప్పందంలోని నిబంధనల ప్రకారం చర్యలు తీసుకున్నామన్నారు. 2012 ఏప్రిల్‌లో భూమి అప్పగించగా, అప్పటి నుండి రెండు సంవత్సరాల్లోపు ప్రాజెక్టును పూర్తిచేసి వాణిజ్యపరమైన కార్యకలాపాలు ప్రారంభించాలని ఒప్పందంలో ఉంది. ఈ విషయంలో విఫలమైన నేపథ్యంలో ప్రభుత్వానికి, సిటీ ఆఫ్ డెస్టినీ క్లబ్స్, రిసార్ట్స్ సంస్థకు మధ్య ఒప్పందాన్ని రద్దు చేయవచ్చన్నారు. వీటితోపాటు పలు ఆర్థికపరమైన అంశాల్లోనూ సదరు సంస్థ ప్రభుత్వానికి భారీగా బకాయిలు పడుతూ వచ్చిందని, ఆ మొత్తం దాదాపు రూ.50 లక్షలకు చేరుకోగా, దాన్ని రాబట్టేందుకు న్యాయపరమైన చర్యలకు ఉపక్రమించనున్నామని పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి ముఖేష్‌కుమార్ మీనా హెచ్చరించారు.