ఆంధ్రప్రదేశ్‌

మున్సిపాలిటీల్లో మోగిన సమ్మె సైరన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), జూలై 11: రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు , కార్పొరేషన్‌లలో పారిశుద్ధ్య పనులను ప్రైవేటీకరిస్తూ ప్రభుత్వం జారీ చేసిన 279 జీవోను రద్దు చేయడమే కాకుండా ప్రస్తుతం ఆ జీవో ప్రకారం పిలిచిన టెండర్ల అమలును నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్మికులు మంగళవారం సమ్మె ప్రారంభించారు. గురువారం వరకూ మూడు రోజుల పాటు రాష్ట్రంలోని 110 మున్సిపల్ కేంద్రాల్లోని సుమారు 30వేలకు పైగా కార్మికులు ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. సమ్మెలో భాగంగా బుధవారం నగరంలోని రాష్ట్ర మున్సిపల్ మంత్రి నారాయణ ఇంటిని ముట్టడించి ప్రభుత్వంపై మరింత వత్తిడి తీసుకొచ్చేందుకు సమాయత్తమవుతున్నారు. మంగళవారం సమ్మె చేస్తున్నట్టు ప్రకటించిన కార్మికులు విధులను బహిష్కరించారు. దీంతో పరిసరాల్లో పారిశుద్ధ్య పనులైన ఇంటింటి చెత్త సేకరణతోపాటు రహదారుల శుభ్రం, చెత్త తరలింపు, దోమల నిర్మూలన వంటి పనులన్నీ నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురైనారు. కార్మికుల సమ్మెతో మున్సిపల్ ప్రజారోగ్యశాఖాధికారులు ప్రత్యమ్నాయ చర్యలు తీసుకొన్నా ఫలితం లేకపోయింది. కాగా మున్సిపల్ కార్మికుల సంఘాల జెఏసి నేతృత్వంలో నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి విఎంసి కార్యాలయం వరకూ కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించి ధర్నా చేపట్టారు. ప్రస్తుత సమ్మెతో ప్రభుత్వం దిగి రాకుంటే కార్మిక సమ్మెను మరింత ఉద్ధృతం చేస్తామని జెఏసి నేతలు ఎస్ వెంకట సుబ్బయ్య, సిహెచ్ బాబూరావు, ఆసుల రంగనాయకులు, దోనేపూడి కాశీనాధ్ హెచ్చరించారు.