ఆంధ్రప్రదేశ్‌

మీ హామీలకు కుందేళ్ళూ బెదరవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూలై 11: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రకటించిన తొమ్మిది హామీల్లో విశేషమైనది ఏమీ లేదు.. వాటి ద్వారా ప్రస్తుతం తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేస్తున్న దానికంటే అదనంగా చేకూరేది ఏమీ లేదని రాష్ట్ర సమాచారమంత్రి కాలువ శ్రీనివాసులు అన్నారు. ఉత్తరకుమార ప్రగల్భాలుగా వున్న తొమ్మిది సొల్లు హామీలకు తెలుగుదేశం బెదిరిపోతున్నదనేది వైకాపా ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి చిత్తభ్రమ మాత్రమేనని మంగళవారం ఒక ప్రకటనలో ఎద్దేవా చేశారు. జైలు భయంతో జగన్ సొల్లు హామీలిస్తున్నారనే విషయం ప్రజలకు తెలుసునన్నారు. తన వద్ద ఉన్న వేల కోట్ల అక్రమ సంపాదనను ప్రజలకు పంచితేనే జగన్‌ను ప్రజలు నమ్ముతారు తప్ప హామీలతో నమ్మరుగాక నమ్మరన్నారు. పాదయాత్ర కాదుకదా కాశీయాత్ర చేసినా తన పాపాలకు విముక్తి కలగదని ఎద్దేవా చేశారు. దశలవారీగా మద్య నిషేధం అమలు చేస్తామని వైఎస్ రాజశేఖరరెడ్డి 2004 మేనిఫెస్టోలో హామీ ఇచ్చి మోసం చేశారని వైఎస్ అధికారం చేపట్టే నాటికి రూ. 3వేల కోట్లు ఉన్న మద్యం ఆదాయం, తరువాత రూ. 30వేల కోట్లకు పెంచారని గుర్తు చేశారు. మాట మాటకి మడమ తిప్పేది జగన్ అనేది ప్రజలకు తెలుసునన్నారు. డ్వాక్రా మహిళలు, రైతులను ఆదుకున్నది చంద్రబాబు మాత్రమేనన్నారు.