ఆంధ్రప్రదేశ్‌

నిరుపేదలకు సక్రమంగా నిత్యావసరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 11: రాష్ట్రంలో పేదలందరికీ నిత్యావసర సరకులు సక్రమంగా అందేలా కృషి చేస్తామని ఏపి స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్ జెఆర్ పుష్పరాజ్ తెలిపారు. వెలగపూడి సచివాలయంలోని నాలుగో బ్లాక్ పబ్లిసిటీ సెల్‌లో మంగళవారం నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జాతీయ ఆహార భద్రతా చట్టం, 2013 అనుసరించి మొదటిసారిగా రాష్ట్రంలోనే ఏపి స్టేట్ ఫుడ్ కమిషన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. కమిషన్ చైర్మన్‌గా తనను ఎంపిక చేయడంపై సిఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో పేదలకు పౌష్టికాహారం పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాలు అమలు చేస్తోందన్నారు. నిత్యావసర సరకుల పంపిణీలో అక్రమాలకు తావులేకుండా కమిషన్ చర్యలు తీసుకుంటుందన్నారు. నిత్యావసర సరకుల పంపిణీలో అక్రమాలకు పాల్పడేవారిపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. జిల్లా స్థాయిలో గ్రీవెన్స్ రిడ్రసల్ అధికారితోపాటు రాష్ట్ర స్థాయిలో అప్పీలేట్ కమిటీ నిత్యావసర సరకుల పంపిణీపై పర్యవేక్షణ చేస్తుంటుందన్నారు. నిత్యావసర సరకుల పంపిణీపై ఏటా వార్షిక రిపోర్టులు రూపొందించి అసెంబ్లీ ముందు ఉంచుతామన్నారు. ఆహార భద్రతపై రాష్ట్ర ప్రభుత్వానికి కమిషన్ సలహాలు, సూచనలు అందజేస్తోందన్నారు.