ఆంధ్రప్రదేశ్‌

పార్టీని పరుగులు పెట్టించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూలై 11: పార్టీ నామినేటెడ్ పదవులు, పెన్షన్ వంటి పథకాలను సంతృప్తికర స్థాయికి తీసుకువెళ్లినందున ఇకపై పార్టీని పరుగులు పెట్టించాలని టిడిపి అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. దేశంలో ఏ పార్టీ ఇవ్వనన్ని నామినేటెడ్ పోస్టులు మనమే ఇచ్చామని, పెన్షన్లు సంతృప్తికర స్థాయికి వెళ్లినందున రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలను జనంలోకి తీసుకువెళ్లేందుకు కొత్త కార్యక్రమాలు చేపట్టే ఆలోచన చేయాలని సూచించారు. మంగళవారం ఆయన సచివాలయంలో మంత్రులు యనమల రామకృష్ణుడు, కళావెంకట్రావు, నారాయణ, ప్రభుత్వ సలహాదారు డాక్టర్ పరకాల ప్రభాకర్, పార్టీ కార్యక్రమాల కమిటీ కన్వీనర్, ఎమ్మెల్సీ వివివి చౌదరి, తదితరులతో రెండు గంటలు భేటీ అయ్యారు. అనంతరం మాట్లాడుతూ తాను త్వరలో జిల్లాల పర్యటనలకు వెళతానని, అక్కడ మునుపటిలా కాకుండా నేతలు-కార్యకర్తలతో సమయం వెచ్చిస్తానని వెల్లడించారు. ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు కొత్తగా ఎలాంటి కార్యక్రమాలు రూపొందించాలో ఆలోచించాలని సూచించారు. పదవులు తీసుకున్న వారు వౌనంగా ఉండటం మంచిదికాదని, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రముఖులంతా క్యాబినెట్‌లో వచ్చినందున, ఇక మిగిలిన నాయకులే అన్నీ చూసుకుంటారులేనన్న ధోరణి సరైంది కాదని, వారు కూడా చురుకుగా పనిచేయాలన్నారు. ఇకపై విజయవాడ, విశాఖ, కర్నూలు వంటి అన్ని నగరాల్లో రోజూ ఏదో ఒక చోట పార్టీ ప్రముఖులు మీడియా సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు. ప్రభుత్వ పథకాలకు మరింత ప్రచారం వచ్చేలా చూడాలన్నారు. ప్లీనరీలో జగన్ చేసిన ఆరోపణలను మంత్రులు, పార్టీ నేతలు సమర్థవంతంగా తిప్పికొట్టారని ప్రశంసించారు. వైసీపీ అభివృద్ధి నిరోధక విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, అదేవిధంగా గత మూడేళ్ల నుంచి ఆ పార్టీ రాష్ట్భ్రావృద్ధికి అడ్డుపడుతున్న వైనాన్ని వివరించేందుకు మంత్రులు-పార్టీనేతల సమన్వయ కమిటీ కృషి చేయాలని ఆదేశించారు.