ఆంధ్రప్రదేశ్‌

పూతలపట్టు ఎమ్మెల్యేపై కేసు నమోదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాకాల, జూలై 11: స్వల్పవివాదంలోజరిగిన ఘర్షణలో పూతల పట్టు వైఎస్‌ఆర్‌సిపి ఎమ్మెల్యే సునీల్‌కుమార్, అతని బావమరిది రాజేష్ మరికొందరిపై పాకాల పోలీసులు సోమవారం అర్థరాత్రి కేసు నమోదు చేశారు. పాకాల భారత మిట్ట 1వ క్రాస్‌లో పూతలపట్టు ఎమ్మెల్యే సునీల్‌కుమార్, అతని తల్లి నివాసం ఉంటున్నారు. ఆ ఇంటి పక్కనే్న ఎం.మునెమ్మ నూతనంగా ఇల్లు నిర్మిస్తోంది. సోమవారం మధ్యాహ్నం ఆ నిర్మాణంలోని ఇంటి నుంచి సిమెంట్ పెళ్లలు ఎమ్మెల్యే ఇంటిపై పడ్డాయి. దీంతో ఎమ్మెల్యే తల్లి, వాళ్లింట్లో పనిమనిషి కలసి మునెమ్మతో గొడవపడ్డారు. వివాదం అంతటితో సద్దుమణగకపోగా రాత్రి ఇంటికి వచ్చిన ఎమ్మెల్యేకు విషయం తెలపడంతో ఎమ్మెల్యే సునీల్‌కుమార్, అతని బావమరిది రాజేష్ కలిసి మునెమ్మ, ఆమె కుమారుడ్ని పిలిపించి హెచ్చరించారు. అయితే తనను, తన కుమారుడిని ఎమ్మెల్యే కొట్టి, జుట్టుపట్టుకుని బయటకు తోశారని మునెమ్మ పాకాల పోలీసులకు ఫిర్యాదుచేసింది. మునెమ్మ ఫిర్యాదు మేరకు పాకాల పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తుచేస్తున్నారు. ఎమ్మెల్యే సునీల్‌కుమార్, అతని భావమరిదిపై కేసు నమోదుచేశారు.