ఆంధ్రప్రదేశ్‌

జిఎస్‌టితో పెరిగిన నేత, జరీ చీరల ధరలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 11: మహిళలు మక్కువతో ధరించే నేత, జరీ చీరలకూ జిఎస్‌టి పోటు తప్పలేదు. జిఎస్‌టికి తోడు చైనా పట్టు, పవర్‌లూమ్‌లు కలిసి చేనేత రంగంపై ముప్పేట దాడి చేస్తున్నాయి. చేనేత రంగాన్ని ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఇందుకు అవసరమైన ముడిసరకుపై జిఎస్‌టిని విధించడంతో చేనేత రంగం సంక్షోభంలో పడింది. పన్ను పోటు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఈ రంగంపై ఆధారపడిన కుటుంబాలు కోరుతున్నాయి. గతంలో రాష్ట్రంలో 5 లక్షల మగ్గాలు గతంలో ఉండగా, ప్రభుత్వ విధానాల కారణంగా ప్రస్తుతం వాటి సంఖ్య 3 లక్షలకు పడిపోయింది. డిమాండ్ ఉన్నప్పటికీ, చేనేత రంగం లాభసాటిగా లేకపోవడంతో మగ్గాలు చాలా వరకూ మూతపడుతున్నాయి. మంగళగిరిలో ఒకప్పుడు 11వేల మగ్గాలు ఉండగా, నేడు 1000కు తగ్గడం పరిస్థితి తీవ్రతను తెలియచేస్తోంది. ఇటీవల అమల్లోకి వచ్చిన జిఎస్‌టి ప్రభావం చేనేత రంగంపై తీవ్రంగా పడింది. చిలపలు (ఎచ్చెలు)పై 5 శాతం మేర పన్ను విధించారు. జరీ చీరల్లో వాడే జరీపై 12 శాతం పన్నును కొత్తగా విధించారు. చీర ఖరీదు 1000 రూపాయలకు మించితే 18 శాతం మేర పన్ను చెల్లించాల్సి ఉంటుంది. దీంతో 1000 రూపాయల కంటే ఎక్కువ ఖరీదు ఉన్న నేత చీర ధర 23 శాతం మేర పెరిగింది. జరీ చీరకు 35 శాతం మేర ధర పెరగింది. దీంతో 1000 రూపాయలు ఉన్న నేత చీర 1230 రూపాయలకు, జరీ చీర 1350 రూపాయలకు పెరిగింది. దీంతో పెరిగిన ధరలతో చీరల కొనుగోళ్లు తగ్గే అవకాశం ఉందని చేనేత వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే చేనేత రంగం లాభసాటిగా లేని నేపథ్యంలో ఈ రంగానికీ చైనా పోటీ తప్పడం లేదు. పట్టు చీరల తయారీని ప్రభుత్వం ప్రోత్సహించడంతో ధర్మవరంలో కోట్ల రూపాయల పెట్టుబడులతో కొన్ని యూనిట్లను నెలకొల్పారు. అక్కడ భారీ పెట్టుబడులతో చైనా కంపెనీలు పట్టు చీరల తయారీ పరిశ్రమలను పెట్టేందుకు వీలుగా ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. దీంతో యంత్రాలపై పట్టుచీరలు తయారు చేస్తున్నారు. ఇవి మగ్గాలపై నేసిన చీరల కన్నా తక్కువ ధరకే లభిస్తాయి. 11 రకాల వస్త్రాలను కేవలం మగ్గాలపై తయారు చేసి విక్రయించాలని పేర్కొంటూ, పవర్‌లూమ్‌లపై తయారు చేయటంపై నిషేధం విధించినప్పటికీ, చిన్న మార్పులతో పవర్‌లూమ్‌లపై ఆయా వస్త్రాలను తయారు చేస్తున్నారు. దీంతో మగ్గాలపై నేసిన చీరలు, ఇతర వస్త్రాల కంటే పవర్‌లూమ్‌పై చేసిన వాటి ధర తక్కువగా ఉంటోంది. ముడి నూలుతో పవర్‌లూమ్‌లపై చేసిన వస్త్రాల నాణ్యత కంటే మగ్గాలపై చేసి వస్త్రాలు మన్నిక ఎక్కువగా ఉంటుంది. అయితే మగ్గాలపై నేసిన చీరల ధర ఎక్కువగా ఉంటుంది. దీంతో మగ్గాలపై నేసిన చీరల కొనుగోళ్లు తగ్గుతున్నాయి. కొనుగోళ్లు తక్కువగా ఉంటే, ఈ రంగంపై ఆధారపడిన వారి పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం ఉంది. ఇప్పటికే శానిటరీ నాప్కిన్స్‌పై భారీగా పన్ను విధించి మహిళల ఆగ్రహాన్ని చవి చూస్తున్న కేంద్ర ప్రభుత్వం, చీరల ధరలను ప్రభావింతం చేసేలా పన్ను విధించడం కూడా విమర్శలకు గురి అవుతున్నది. జిఎస్‌టి నుంచి చేనేత రంగానికి మినహాయింపు ఇవ్వాలని విజ్ఞప్తి చేసినా ఫలితం లేదని ఎపి చేనేత కార్మిక సుంఘం ఉపాధ్యక్షుడు పిల్లలమర్రి నాగేశ్వరరావు ఆరోపించారు. కేంద్రం దీనిపై పునరాలోచించాల్సి ఉందన్నారు. పవర్‌లూమ్‌ల ద్వారా వచ్చే వస్త్రాల ధర తక్కువగా ఉండటంతో మగ్గాలపై నేసిన చీరలకు డిమాండ్ తగ్గే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.