ఆంధ్రప్రదేశ్‌

హైకోర్టు డిజైన్ బాగుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 13: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి రాజధాని రంగంలో నిర్మించనున్న హైకోర్టు భవన డిజైన్ బాగుందని ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రమేష్ రంగనాథన్ సంతృప్తి వ్యక్తం చేశారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ రమేష్ రంగనాథన్‌తోపాటు సీనియర్ జడ్జీలకు హైదరాబాద్‌లో గురువారం నార్మన్ ఫోస్టర్స్ ప్రతినిధులు డిజైన్లపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. నార్మన్ ఫోస్టర్స్ ప్రతినిధులు క్రిస్‌బాబ్, రాబ్ సిమోర్, ఫిలిప్, హఫీజ్ కాంట్రాక్టర్స్ ప్రతినిధి నిషాన్, ఏపి సిఆర్‌డిఏ కమిషనర్ డాక్టర్ చెరుకూరి శ్రీ్ధర్, ఏపి సిఆర్‌డిఏ ప్లానింగ్ అధికారులు హైకోర్టు డిజైన్ల గురించి వివరించారు. స్థూప డిజైన్ జనరల్ కానె్సప్ట్ బాగుందని, డైమండ్ డిజైన్ కూడా బాగుందని హైకోర్టు చీఫ్ జస్టిస్ సంతృప్తి వ్యక్తం చేశారు. కోర్టు బెంచీలను పరిశీలించడానికి మధురై, అహ్మదాబాద్ కోర్టులను సందర్శించాలని హైకోర్టు చీఫ్ జస్టిస్ నార్మన్ ఫోస్టర్ ప్రతినిధులకు సూచించారు. తప్పనిసరిగా వాటిని అధ్యయనం చేస్తామని వారు హామీ ఇచ్చారు. శుక్రవారం ముఖ్యమంత్రిని కలిసి డిజైన్లపై చర్చిస్తామని, సవివరమైన డిజైన్లతో మళ్లీ వస్తామని నోర్మన్ ఫోస్టర్ ప్రతినిధులు చెప్పారు.