ఆంధ్రప్రదేశ్‌

వడ్డీ భారాన్ని తగ్గించుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూలై 13: విద్యుత్ శాఖ వివిధ పద్దుల కింద తీసుకున్న రుణాల వడ్డీ రేట్లు తగ్గించుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్ ఆ శాఖ అధికారులను ఆదేశించారు. గురువారం సచివాలయంలో విద్యుత్ శాఖ అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో విద్యుత్ శాఖ ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్, జెన్కో ఎండి విజయానంద్‌తో సహా పలువురు అధికారులు పాల్గొన్నారు. వచ్చే రెండేళ్లలో విద్యుత్ శాఖ చేపట్టబోతున్న కార్యక్రమాలను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రధాన కార్యదర్శికి అజయ్ జైన్ వివరించారు. అనంతరం చీఫ్ సెక్రటరీ దినేష్‌కుమార్ మాట్లాడుతూ విద్యుత్ శాఖ ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను అధిగమించడానికి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా గతంలో 10.5 శాతం వడ్డీకి తీసుకున్న రుణాలను, ఇప్పటి వడ్డీ రేట్లకు అనుగుణంగా తీసుకుంటే భారీగా రుణ భారం తగ్గించుకోవచ్చన్నారు. అలాగే రూ. 1500 కోట్లతో రివాల్వింగ్ ఫండ్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా రెండు శాతం రిబేటు కూడా తీసుకోవచ్చని సూచించారు. వౌలిక సదుపాయాల కల్పన పట్టే పెట్టుబడి అదుపు తప్పకుండా చూసుకోవాలని అధికారులను హెచ్చరించారు. ఇంధన ఖర్చులను అదుపు తప్పకుండా చూసుకోవాలని సూచించారు. గత ఐదేళ్ళుగా రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ, సరఫరా కోసం అవుతున్న ఖర్చు, వస్తున్న నష్టాలను ఇతర రాష్ట్రాలతో పోల్చి చూసుకుని, ఖర్చులు తగ్గించుకోవడానికి ఏం చేయాలన్న అంశంపై అధ్యయనం చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. తక్కువ మొత్తాల్లో ఉన్న రుణాల చెల్లింపును ఉదయ్ స్కీం కిందకు మార్చుకోవడం ద్వారా వచ్చే ప్రయోజనాలను విద్యుత్ రంగం అభివృద్ధికి ఖర్చు చేయాలని సూచించారు. సోలార్ విద్యుత్ వాడకం విస్తృతంగా అమల్లోకి వచ్చాకా కూడా థర్మల్ విద్యుత్ ఉత్పత్తికి భారీ మొత్తంలో నిధులు ఖర్చు చేయాల్సి రావడంపై ఆయన అధికారులను నిలదీశారు. ఇతర రాష్ట్రాల్లో తక్కువ ఖర్చుతో విద్యుత్ ఉత్పత్తికి అనుసరిస్తున్న మార్గాలను అధ్యయనం చేసి ఆయా అంశాలను మన రాష్ట్రానికి అనుకూలంగా మార్చుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు.