ఆంధ్రప్రదేశ్‌

ఇళ్ల ఎంపిక స్వేచ్ఛ లబ్ధిదారులకే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూలై 13: రాష్ట్రంలోని అన్ని పట్టణాలు, నగరాల్లో ‘ఎన్టీఆర్ నగర్’ నిర్మాణాలు యుద్ధప్రాతిపదికన చేపట్టాలని, పక్కా ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు. గురువారం తన నివాసం నుంచి పట్టణాల్లో ఇళ్ల నిర్మాణంపై అధికారులు, ప్రజాప్రతినిధులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. మన రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణం దేశానికే నమూనా కావాలన్నారు. సంపన్నుల ఇళ్లకు దీటుగా పేదల ఇళ్ల నిర్మాణం జరగాలన్నారు. దేశంలో ఎక్కడా లేని రీతిలో అద్భుతంగా మన రాష్ట్రంలో ఇళ్లు నిర్మించాలన్నారు. ఇల్లు అనేది ఒక ఆస్తి మాత్రమే కాదు, సెంటిమెంట్ కూడా అనేది అందరూ గుర్తుంచుకోవాలన్నారు. రాష్ట్రంలో నిర్మించే ఇళ్లు లబ్ధిదారులకు సౌకర్యవంతంగా, ప్రశాంతంగా, సంతోషం చేకూర్చేవిగా ఉండాలన్నారు. పూర్తి ప్రశాంతతో, చక్కని సౌకర్యాలతో, సంతోషానికి మూల కేంద్రంగా ఆంధ్రప్రదేశ్‌లో పక్కా ఇళ్ల నిర్మాణం జరగాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ సంకల్పంగా పేర్కొన్నారు. ప్రతి నెలా ఇళ్ల నిర్మాణ పురోగతిని తనిఖీ చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. ప్రతి మున్సిపాలిటీలో లబ్ధిదారులతో వర్క్‌షాపులు నిర్వహించాలని సూచించారు. తాను కూడా ఈ వర్క్‌షాపుల్లో పాల్గొంటానని చెప్పారు. కేటగిరీల వారీగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను మూడు రోజుల్లో పూర్తిచేయాలని ఆదేశించారు. ఇళ్ల నిర్మాణానికి మూడు నమూనాలు ఇచ్చామంటూ, తగిన నమూనాను లబ్ధిదారుడే ఎంపిక చేసుకోవాలన్నారు. నమూనాల ఎంపికను త్వరితగతిన పూర్తిచేయాలన్నారు. వచ్చే వారం అన్ని పట్టణాల్లో హౌసింగ్ వర్క్‌షాపులు నిర్వహించాలని ఆదేశించారు. గేటెడ్ కమ్యూనిటీగా ఇళ్ల నిర్మాణాన్ని ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రైవేటు డెవలపర్స్‌కు దీటుగా ప్రభుత్వ ఇళ్ల నిర్మాణం జరగాలన్నారు. జి ప్లస్ 7 నిర్మాణాలకు నిధులు కావాల్సి వస్తే రాష్ట్ర ప్రభుత్వం సగం భరిస్తుందని, మిగిలిన సగం లబ్ధిదారులు భరించాలని సూచించారు. ఇల్లు బాగుంటే, సౌకర్యవంతంగా ఉంటే తమ వాటా కింద ఎక్కువ భరించడానికి కూడా లబ్ధిదారులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. లబ్ధిదారుల సంతోషం, సంతృప్తే లక్ష్యంగా పక్కా గృహాల నిర్మాణం జరగాలన్నారు. ‘ప్రతి ఇంటికి రూ.3 లక్షలు సబ్సిడీ ఇస్తున్నాం, ఫ్రంట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ నిర్మిస్తున్నాం, ఇళ్ల స్థలం మనమే ఇస్తున్నాం. రోడ్లు, తాగునీరు, విద్యుత్, పచ్చదనం అన్ని వౌలిక సదుపాయాలు ప్రభుత్వమే అభివృద్ధి చేస్తోంది. దేశంలో ఎక్కడా ఇలాంటి ఇళ్ల నిర్మాణం జరగలేదు. అనంతపురం జిల్లా రాప్తాడులో నిర్మించిన ఇళ్ల పట్ల లబ్ధిదారుల్లో పూర్తి సంతృప్తి ఉందని చెప్పారు. వీటిని పరిశీలించి మిగిలిన ప్రాంతాల్లో కూడా అదే తరహా ఇళ్ల నిర్మాణాన్ని వేగిరపరచాలని కోరారు. ఒక్క నంద్యాల నియోజకవర్గంలోనే రూ.800 కోట్లతో పక్కా గృహాలను పేదలకు నిర్మిస్తున్నామని బాబు వెల్లడించారు. పట్టణంలోని మూడు చోట్ల కేటాయించిన 120 ఎకరాల భూమి విలువే రూ.250 కోట్లు ఉంటుందన్నారు. లబ్ధిదారులకు ఇచ్చే సబ్సిడీ విలువ రూ.400 కోట్లు ఉంటుందని, ఆ ప్రాంతాల్లో ప్రభుత్వం నిర్మించే రోడ్లు, తాగునీరు, విద్యుత్, పార్కుల అభివృద్ధి, ఇతర ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ విలువ రూ.150 కోట్లు పైబడి ఉంటుందని వివరించారు. అదే తరహాలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోని పట్టణ ప్రాంతాల్లో భారీఎత్తున ఎన్టీఆర్ నగర్‌ల అభివృద్ధి, పక్కా ఇళ్ల నిర్మాణాన్ని ఈ రెండేళ్లలో శరవేగంతో పూర్తిచేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. టెలీ కాన్ఫరెన్స్‌లో అర్బన్ హౌసింగ్ శాఖ మంత్రి పి.నారాయణ, మంత్రి ఆదినారాయణరెడ్డి, ఇతర మంత్రులు, పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి కరికాల వలవన్, జిల్లా కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, మున్సిపల్ చైర్మన్లు పాల్గొన్నారు.