ఆంధ్రప్రదేశ్‌

గరిమెళ్లకు బాబు నివాళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 13: జాతీయ కవి, రచయిత, స్వాతంత్య్ర సమరయోధుడు గురిమెళ్ల సత్యనారాయణ తుది శ్వాస దాకా విలువలకు నిబద్ధుడై జీవించారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. జూలై 14న గరిమెళ్ల జయంతి సందర్భంగా ఆయన గరిమెళ్ల స్ఫూర్తిని గుర్తు చేసుకున్నారు. ‘మాకొద్దీ తెల్లదొరతనం’ గేయంతో తెలుగుజాతిలో పౌరుషాన్ని రగిలించారని ఆయన శ్లాఘించారు. ఈ గీతాన్ని గరిమెళ్ల స్వయంగా గానం చేసి ఉర్రూతలూగించారన్నారు. ఆనాడు మహాత్ముని సత్యాగ్రహ ఉద్యమానికి తెలుగు నేలపై గరిమెళ్ల తన గేయాలతో ఊపిరిని, ఉత్తేజాన్ని ఇచ్చారని కొనియాడారు. బ్రిటీష్ ప్రభుత్వం భావ ప్రకటనా స్వేచ్ఛకు సంకెళ్ళు వేసిన కాలంలో ‘మాకొద్దీ తెల్లదొరతనం’, ‘దండాలు, దండాలు భరతమాత’ గేయాలు రాసి ఉత్సాహపరిచారని తెలిపారు. క్షమాపణ చెబితే వదిలేస్తామని బ్రిటీష్ అధికారులు సూచించినా గరిమెళ్ల అందుకు నిరాకరించి తన అకళంక దేశభక్తిని నిరూపించుకున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు కొనియాడారు.