ఆంధ్రప్రదేశ్‌

శ్రీశైలం భద్రతపై ప్రత్యేక ప్రణాళిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూలై 13: రాష్ట్రంలో డ్యాంలను పరిరక్షించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని జల వనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. విజయవాడలోని జలవనరులశాఖ కార్యాలయంలో గురువారం శ్రీశైలం డ్యాం స్థిరత్వంపై సమావేశం నిర్వహించారు. డ్యాంల భద్రతపై ప్రభుత్వం ఏర్పాటుచేసిన కమిటీ సభ్యులు ఇందులో పాల్గొన్నారు. కమిటీ చైర్మన్ ఎబి పాండ్యా నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది. మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.ఎన్నో ఏళ్లుగా పట్టించుకోని శ్రీశైలం డ్యాం భద్రత చర్యలకు ప్రభుత్వం నడుం బిగించిందని మంత్రి దేవినేని తెలిపారు. ఇలాఉంటే శ్రీశైలం డ్యాం భద్రతపై విస్తృతంగా కమిటీ చర్చించింది. పలు సూచనలు, ప్రతిపాదనలపై అధ్యయనం చేయాలని నిర్ణయించింది. పరిరక్షణ, అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన చర్యలపై పలు ప్రతిపాదనలను సిద్ధం చేయాలని తీర్మానించింది. టెయిల్ పాండ్‌లో నీటి విడుదల స్థాయిలు, భద్రతా చర్యలపై నివేదిక రూపొందించాలని తీర్మానించింది. నిపుణుల తొలి కమిటీ సమావేశంలో మొత్తం 12 అంశాలపై చర్చించింది. శ్రీశైలం డ్యాం పరిరక్షణ చర్యలు, అవసరమైనచోట గేట్ల మరమ్మతులు చేపట్టడం, డ్యాం భూగర్భ పరిస్థితులపై అధ్యయనం, తదితర చర్యలను వెంటనే చేపట్టాలని సూచించింది. ప్రాజెక్టు పరికరాలను వినియోగంలోకి తీసుకురావడం, ప్రాజెక్టు పునరుజ్జీవంపై అధ్యయనం చేయాలని కోరింది.