ఆంధ్రప్రదేశ్‌

డ్వాక్రాకు పూర్వవైభవం తెస్తున్న బాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 13: దేశ అభివృద్ధికి దోహదపడే డ్వాక్రా సంఘాలను తల్లి, పిల్ల కాంగ్రెస్‌లు నిర్వీర్యం చేస్తే మూడేళ్లలో చంద్రబాబునాయుడు డ్వాక్రా సంఘాలను బలోపేతం చేశారని మాజీ మంత్రి పీతల సుజాత పేర్కొన్నారు. బాబు ప్రభుత్వం మహిళలు తలెత్తుకునేలా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చేపట్టిందని, 71 లక్షల డ్వాక్రా మహిళల ఆదాయం పెంపే లక్ష్యంగా చంద్రబాబునాయుడు అహర్నిశలు కృషి చేస్తున్నారని గురువారం ఒక ప్రకటనలో సుజాత గుర్తుచేశారు. స్వయం సహాయక సంఘాల ద్వారా ప్రతి మహిళకు రూ.10వేలు ఆదాయం ఉండేలా ముఖ్యమంత్రి చర్యలు తీసుకున్నారని, డ్వాక్రా సంఘాల బలోపేతానికి తమ ప్రభుత్వం తీసుకున్న చర్యలు యావత్ భారతదేశానికి ఆదర్శంగా నిలిచాయన్నారు. తుపాను షెల్టర్లు, జనరిక్ మందుల షాపులు, రేషన్ షాపులు, పాఠశాలల నిర్వహణ వంటి ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో డ్వాక్రా సభ్యులకు భాగస్వామ్యం కల్పిస్తున్నారని గుర్తుచేశారు. లోటు బడ్జెట్‌లో కూడా డ్వాక్రా రుణమాఫీ చేసి మహిళలకు ప్రభుత్వం అండగా నిలబడిందని, ఇప్పటివరకు రెండు విడతల్లో ఒక్కొక్కరికి రూ.6వేలు సాయాన్ని అందించగా మిగిలిన మొత్తాన్ని కూడా త్వరలో చెల్లించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని వివరించారు. డ్వాక్రా సంఘాల బలోపేతానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలతో దాదాపు రూ.4,415 కోట్ల పొదుపును చేసి ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని ఆమె వెల్లడించారు.