ఆంధ్రప్రదేశ్‌

నీటి ప్రవాహంతో డ్యాముల సామర్థ్యం లెక్క

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 13: రాష్ట్రంలో 166 మేజర్ డ్యాముల సామర్థ్యాన్ని పరిశీలించి నివేదిక ఇవ్వడానికి కృషి చేస్తున్నామని, వాటి సామర్థ్యాన్ని ప్రవహించే నీటి ఆధారంగా లెక్కిస్తామని పిఓఇ (్ఫ్యనల్ ఆఫ్ ఎక్స్‌ఫర్ట్స్) చైర్మన్ ఎబి పాండ్యా వెల్లడించారు. భారతదేశంలో మేజర్ డ్యామ్‌లు 5,100 ఉన్నాయన్నారు. భద్రతకు సంబంధించి వంద సంవత్సరాల వరకు ఏ విధమైన ఇబ్బందులు ఉండవని, కాలానుగుణంగా వచ్చే మార్పులు ఆధారంగా పరిశీలిస్తామన్నారు. దేశ వ్యాప్తంగా 100 నుంచి 150 సంవత్సరాల వరకు పనిచేస్తున్న డ్యామ్‌లు ఉన్నాయన్నారు. రాష్ట్రంలోని మేజర్ ప్రాజెక్టుల భద్రతపై అధ్యయనం చేయడానికి డ్యామ్ సేఫ్టీ కమిటీ ఆధ్వర్యంలో తొలి సమావేశం విజయవాడలోని జలవనరుల శాఖ క్యాంపు కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పాండ్యా మాట్లాడుతూ మానవ నాగిరికతకు డ్యామ్‌లు ఎంతో ఉపయోగకరంగా ఉంటున్నాయని అయితే ఇటీవల ప్రాజెక్టుల్లో పూడిక పేరుకుపోవడం వల్ల నీటి నిలువ సామర్థ్యం తగ్గిపోతుందన్నారు. ఈ సమస్య ప్రధానమైన ప్రాజెక్టులన్నింటిలో నెలకొందన్నారు. రాష్ట్రంలోని ప్రధాన డ్యామ్‌లతో పాటు, చిన్నతరహా డ్యామ్‌ల పరిస్థితిని కూడా ప్యానల్ ఎక్స్‌పర్ట్స్ కమిటీ పరిశీలించనుందన్నారు. రాష్ట్రంలో డ్యామ్‌ల పరిస్థితిపై మొదటి సమావేశాన్ని నిర్వహిస్తున్నామన్నారు.