ఆంధ్రప్రదేశ్‌

అవి నవరత్నాలు కాదు.. గులక రాళ్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూలై 13: ప్లీనరీలో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రకటించింది నవరత్నాలు కాదు, 9 గులకరాళ్లు.. ఈ మేరకు వైకాపా పనికిమాలిన హామీల బడ్జెట్‌పై చర్చ అనవసరం.. ఎందుకూ కొరగాని హామీలను ప్రకటించి వాటిపై వాళ్లలో వాళ్లే బడ్జెట్ వ్యయాల గురించి చర్చల బిల్డప్ ఇవ్వడం హాస్యాస్పదం.. మేము భయపడేది మీ హామీల గురించి కాదు, మీ విధ్వంసక ధోరణి గురించి.. అవేమీ కొత్త హామీలు కాదు, 2004, 2009, 2014లో తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ మేనిఫెస్టోలలోనివేనని ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు గురువారం ఒక ప్రకటనలో ఎద్దేవా చేశారు. వైఎస్ ఐదేళ్లలో ఇచ్చిన వ్యవసాయ రుణాలకన్నా తాము మూడేళ్లలోనే మూడు రెట్లు అధికంగా ఇచ్చామన్నారు. 18 శాతం అపరాధ రుసుం చెల్లించిన ఒక్క రైతును చూపించమన్న సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి ఛాలెంజ్‌కు వైకాపా నేతలు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు.