ఆంధ్రప్రదేశ్‌

తోటలు, కోళ్ల గూళ్లలోకి సెర్ప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 13: మొదటి నుంచి డ్వాక్రా గ్రూపుల చైతన్యానికి కేంద్రమైన ఆంధ్రప్రదేశ్‌లో వీటి స్వయం సమృద్ధి క్రమంగా శాశ్వత రూపం తీసుకునే విధంగా ప్రభుత్వం వ్యూహాలను రూపొందిస్తోంది. గ్రామీణ జీవన శైలిలో మార్పులు తీసుకొచ్చేందుకు ప్రణాళిక రూపొందిస్తోంది. ఇప్పటికే గిరిజన ప్రాంతాల్లో అమలు చేస్తుండగా, త్వరలో మైదాన ప్రాంతాల్లో అమలుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు రూ.1.95 కోట్లతో ఒక సమగ్ర ప్రణాళికను సెర్ప్ రూపొందించింది. ఇందుకోసం మొదట మానవాభివృద్ధి సూచీలను పెంచుకోవలసి వుంటుంది. ఇందులో భాగంగా 150 మండలాలను ‘గ్రామీణ కలుపుగోలు వృద్ధి’ పథకం కిందకు తెచ్చింది. ఆరోగ్యం, పౌష్టికాహారం, పారిశుద్ధ్య విషయాల్లో మెరుగైన పద్ధతులను సూచిస్తూ గ్రూపు సభ్యుల ప్రవర్తనలోను, ఆలోచనా ధోరణిలోనూ మార్పు తీసుకురావాలనేది ప్రభుత్వ వ్యూహమని సెర్ఫ్ అధికారులు చెప్పారు. దీనికోసం కౌమార దశలో ఉన్న బాలికలను గుర్తించడం మొదటి చర్య. రెండవది వివాహానంతరం వారిపై 1000 దినాల నిఘా ఉంటుంది. వారు గర్భం ధరించినది మొదలు శిశువుకు రెండేళ్లు వచ్చేంతవరకు ఇది కొనసాగుతుంది. తల్లికి పౌష్టికాహారం ఇంటి పెరడు నుంచే అందేలా అవసరమైన సహకారం అందించనుంది. తీసుకునే ఆహారంలో ఎంపిక చేసిన పప్పులు, అపరాలు, తృణధాన్యాలు, కూరగాయలు, ఆకుకూరలు, పాలు, జంతు సంబంధ ఆహారాలు, నూనెలు, కొవ్వు పదార్థాలు, డ్రైఫ్రూట్స్ ఇస్తారు. బిడ్డ పుట్టాక ఆరు నెలలపాటు విధిగా తల్లిపాలు ఇవ్వడం కూడా భాగంగా వుంటుంది. ఇందుకుగాను మొదట ప్రతి గ్రామ సంఘం 40 కూరల పెరళ్లను పెంచాలి. మండల సమాఖ్య ఆవరణలో పండ్ల చెట్లు, నమూనా కూరగాయ తోటలను పెంచాలి. పెరళ్లలో కోళ్లను పెంచడానికి వీలుగా 13 జిల్లాల్లో 39 పౌల్ట్రీ మదర్ యూనిట్లు నెలకొల్పుతారు. ప్రస్తుతం కోడి పావు కిలో బరువుండే దశలో, తొలుత గిరిజన మండలాల్లో ఒక్కో ఇంటికి 45 కోళ్ల చొప్పున ఉచితంగా ఇస్తున్నారు. గుడ్లు - మాంసం ఇంటి అవసరాలకు వాడుకుని, మిగిలినవి స్థానిక గిరిజన హాస్టళ్లకు అమ్ముకోవచ్చు. ఇందుకు అవసరమైన పరిశుభ్రత, పారిశుద్ధ్యం విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలను గ్రామ సంఘం మీటింగ్‌లో స్థానిక అంగన్ వాడి కార్యకర్త/ఎఎన్‌ఎం సభ్యులకు చెబుతారు. ప్రస్తుతం గిరిజన మండలాల్లో ముమ్మరంగా జరుగుతున్న ఈ కార్యక్రమం త్వరలో మైదాన ప్రాంత గ్రామాల్లోను అమలు చేయడానికి సెర్ప్ ప్రణాళిక సిద్ధం చేస్తోంది.