ఆంధ్రప్రదేశ్‌

చికిత్స పొందుతున్న రోగులకు చంద్రబాబు సాయం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూలై 14: నిస్సహాయ స్థితిలో తన సాయం కోసం వచ్చిన పలువురి బాధలు విని ముఖ్యమంత్రి చంద్రబాబు చలించిపోయారు. విజయవాడకు చెందిన మొక్కపాటి శ్రీనివాసరావుకు న్యూరోసర్జన్ చేయాల్సిన శస్తచ్రికకిత్సను ఆర్థోపెడీషియన్ చేశారు. శస్త్ర చికిత్స వికటించడంతో మూడేళ్లుగా శ్రీనివాసరావు మంచానికే పరిమితమయ్యారు. ఆయన భార్య అనూరాధ శుక్రవారం సచివాలయంలో ముఖ్యమంత్రి సందర్శకుల వేళలో బాబును కలిశారు. సిఎం స్పందిస్తూ రూ.5 లక్షల సహాయం చేశారు. కుటుంబాన్ని ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. అదే విధంగా ‘మిట్ బ్రెయిన్ క్యామర్ నోమా’ వ్యాధితో బాదపడుతున్న గుంటూరుకు చెందిన పూదోట బాలచిన్న తేజకు రూ.6లక్షలు మంజూరు చేశారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం ఐరాల మండలం చింతగుంపలపల్లి వాసి సుబ్రహ్మణ్యం నాయుడికి రూ.10 లక్షలు మంజూరు చేశారు. కర్నూలు నుంచి వచ్చిన సుదర్శనమ్మకు రూ.5 లక్షల సహాయం ప్రకటించారు. కృష్ణాజిల్లా తొర్రగుడిపాడుకు చెందిన చెరుకూరి జయమ్మకు రూ.4 లక్షలు, ప్రకాశం జిల్లా జె.పంగులూరు మండలం రామకూరు వాసి దివ్యాంగుడైన మిరియాల రంగారావుకు తనకు పెన్షన్ మంజూరు చేసినందుకు రూ.30వేల సహాయం ప్రకటించారు.
ముఖ్యమంత్రిని కలిసిన యువ వైద్యుల బృందం
ఇదిలా ఉండగా ముఖ్యమంత్రిని హైదరాబాద్ కిమ్స్, యశోద, కేర్ ఆస్పత్రులకు చెందిన వైద్యులు, హైదరాబాద్‌లో ప్రముఖ హోమియో వైద్యులు వారణాసి మధు కలిశారు. నవ్యాంధ్ర నిర్మాణానికి ఎంతో కష్టపడుతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబును వారు అభినందించారు. అమరావతిలో మెడికల్ సిటీ నిర్మిస్తున్నందుకు సంతోషాన్ని వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రిని కలిసినవారిలో ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ ఉదయకృష్ణ మైనేని, డాక్టర్ శ్రీకాంత్, డాక్టర్ రాహుల్‌రెడ్డి, డాక్టర్ డివిఆర్ కృష్ణ, డాక్టర్ స్వరూప్, డాక్టర్ యోగేందర్, డాక్టర్ రాజా, స్వచ్ఛంద సేవా సంస్థను నిర్వహిస్తున్న యనమల రాజు తదితరులున్నారు.