ఆంధ్రప్రదేశ్‌

అక్టోబర్‌లో ఆర్మీ ర్యాలీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, జూలై 14: ఇక్కడి రాజీవ్ గాంధీ స్టేడియంలో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ అక్టోబర్ 6న నిర్వహించనున్నట్టు ఆర్మీ రిక్రూటింగ్ ఆఫీసర్ కల్నల్ శశాంక్ వర్మ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆర్మీలో సుమారు 400 నుంచి 500 ఖాళీలు ఉన్నాయన్నారు. వాటిని భర్తీ చేసేందుకు ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు. అక్టోబర్ 6 నుంచి 17 వరకు రిక్రూట్‌మెంట్ నిర్వహిస్తామన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాలకు చెందిన అభ్యర్థులు ఈ ర్యాలీలో పాల్గొనవచ్చన్నారు. ఈ సందర్భంగా ఆర్మీ రిక్రూట్‌మెంట్ విధానాన్ని పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.