ఆంధ్రప్రదేశ్‌

అంతర్జాతీయ స్మగ్లర్ల అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, జూలై 14: ఎంతో విలువైన ఎర్ర చందనంను ఇక్కడి స్మగ్లర్ల నుండి కొనుగోలు చేస్తూ విదేశాలకు తరలిస్తున్న అంతర్జాతీయ ముఠాను నెల్లూరు జిల్లా పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ పి హెచ్ డి రామకృష్ణ శుక్రవారం నెల్లూరులో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వివరించారు. ఆయన తెలిపిన సమాచారం మేరకు.. చైనా దేశానికి చెందిన ఓ యు ఫుషూ వ్యాపారం పేరుతో వీసా పొంది ఇండియాకు వచ్చి బెంగళూరు, చెన్నై, ఢిల్లీ నగరాల్లోని ఎర్రచందనం స్మగ్లర్ల సహకారంతో వివిధ మార్గాల ద్వారా ఎర్రచందనాన్ని ఢిల్లీకి చేరవేసి అక్కడ్నుంచి విదేశాలకు పంపిస్తుంటాడు. తానే స్వయంగా ఎర్ర చందనం దుంగల నాణ్యత పరిశీలించి నిర్ధారించుకొనేందుకు వస్తుండేవాడు. ఇతని చర్యలపై నిఘా ఉంచిన నెల్లూరు పోలీసులు అతని కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో గురువారం సాయంత్రం శ్రీకాళహస్తి-యాతలూరు మార్గంలో వాహనాలను క్రైం ఓ ఎస్ డి విఠలేశ్వర్, గూడూరు డి ఎస్పీ బి.శ్రీనివాస్, వెంకటగిరి సి ఐ శ్రీనివాసరావులతో కూడిన బృందం తనిఖీ చేస్తున్న సమయంలో టి ఎన్ 07 ఆర్ 0480 నెంబర్ గల స్కోడా కారు తనిఖీ కేంద్రం వద్ద నిలవకుండా విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బందిపైకి కారును పోనిచ్చే ప్రయత్నం చేస్తూ తప్పించుకున్నారు. వారిని కొద్దిదూరం వెంబడించిన పోలీస్ సిబ్బందిని కారును పట్టుకొని తనిఖీ చేయగా అందులో 340 కిలోల బరువున్న 30 ఎర్ర చందనం దుంగలు దొరికాయి. కారులో ప్రయాణిస్తున్న పుషూతో పాటు నేపాల్ దేశానికి చెందిన సోనమ్ తోప్యాల్, రేణు పాండే, టిబెట్‌కు చెందిన టెంపా గ్యాలెజన్, చెన్నైకు చెందిన టిపుసుల్తాన్‌లను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని విచారించగా చైనాకు చెందిన పుషూ అక్రమంగా ఎర్ర చందనాన్ని కొనుగోలు చేసి పైన పేర్కొన్న ఇతర స్మగ్లర్ల సహకారంతో హాంకాంగ్, చైనా తదితర దేశాలకు తరలిస్తున్నట్లు వెల్లడైంది. నిందితుల నుండి రూ.26వేల నగదు, సెల్‌ఫోన్లు, స్కోడా కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.