ఆంధ్రప్రదేశ్‌

ఉపాధి పనుల్లో జాప్యం వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 14: నిర్దేశించిన గడువులోగా జాతీయ ఉపాధి హామీ పథకంలో చేపట్టిన పనులు పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్ స్పష్టం చేశారు. నిధుల కొరత లేదని, పనుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ జాప్యం చోటుచేసుకోకూడదని సూచించారు. వెలగపూడి సచివాలయంలోని తన కార్యాలయంలో జిల్లాల కలెక్టర్లతో శుక్రవారం ఆయన వీడి యో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జాతీ య ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనుల పురోగతిని ఆయా జిల్లాల కలెక్టర్లను అడిగి తెలుసుకున్నారు. గత రెండేళ్ల మాదిరిగానే చంద్రన్న బాట సిమెంట్ రహదారుల నిర్మాణాలు చేపట్టాలన్నారు. రాష్ట్ర వ్యాప్తం గా ఈ ఏడాది 6వేల కిలోమీటర్ల మేర సిసి రోడ్ల నిర్మాణాలను చేపట్టాలని భావించగా, అందులో జూలై నెలాఖరుకు 996 కిలోమీటర్ల మేర నిర్మాణాలుపూర్తిచేయాలని స్పష్టం చేశారు. ఏయే జిల్లాల్లో ఎంతెంత మేర సిసి రోడ్లు నిర్మించారో అడిగి తెలుసుకున్నారు. ఈ ఏడాది 5,571 అంగన్‌వాడీ కేంద్రాల భవనాల నిర్మాణం పూర్తిచేయాల్సి ఉండగా, జూలై నెలాఖరుకు 1,116 భవనాలను పూర్తిచేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించిందన్నారు. ఇప్పటివరకూ 673 భవనాలు పూర్తయ్యాయని, మిగిలిన వాటిని ఈ నెలాఖరులోగా పూర్తిచేయాలని స్పష్టం చేశారు. జూలై నెలాఖరుకు 120 గ్రామ పంచాయతీల భవనాల నిర్మాణాలు పూర్తిచేయాలని లక్ష్యం నిర్దేశించిందన్నారు. ఇప్పటివరకూ 87 పంచాయతీ భవనాలు పూర్తయ్యాయని, మిగిలిన వాటిని నెలాఖరులోగా పూర్తిచేయాలని అన్నారు. 34 మండల పరిషత్ భవనాలను ఈ నెలాఖరుకు 22 పూర్తిచెయ్యాలని ప్రభుత్వం స్పష్టం చేసిందన్నారు. ఉపా ధి హామీ పథకం కింద 2017-18లో గుర్తించిన పాఠశాలల్లో 2,951 క్రీడా ప్రాంగణాలను అభివృద్ధి చెయ్యాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటివరకూ 2,332 ప్రాంగణాలకు అనుమతులు మంజూరయ్యాయన్నారు. ప్రస్తుతానికి 591 క్రీడా ప్రాంగణాల పనులు ప్రారంభమయ్యాయన్నారు. పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి జవహర్‌రెడ్డి, ఫైనాన్స్ సెక్రటరీ రవిచంద్ర, స్ర్తి, శిశు సంక్షేమశాఖ కమిషనర్ అరుణ్‌కుమార్‌తోపాటు 13 జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు.