ఆంధ్రప్రదేశ్‌

గిరిజన సంక్షేమ విద్యా సంస్థల్లో ‘ఆదివాసి ఆరోగ్యం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 14: గిరిజన సంక్షేమ శాఖ విద్యా సంస్థల్లో రక్తహీనతతో బాధపడుతున్న విద్యార్థుల ఆరోగ్యం మెరుగుపరచటానికి ప్రతిపాదించిన ‘ఆదివాసి ఆరోగ్యం’ కార్యక్రమం అమలు చేసేందుకు గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్.పి.సిసోడియా ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమం ద్వారా రక్తహీనత ఉన్నట్లు గుర్తించిన విద్యార్థులకు ప్రత్యేక ఆహారం, అవసరమైన మందులు ఏర్పాటు చేస్తారు. గిరిజన సంక్షేమ శాఖ విద్యా సంస్థలలో విద్యార్థులు రక్తహీనతతో బాధపడుతున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర పాఠశాల ఆరోగ్య కార్యక్రమం రాపిడ్ సర్వే చేపట్టారు. ఈ రాపిడ్ సర్వే విద్యార్థులందరికీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని వైద్యులచే పరీక్షలు చేయించారు. రక్తహీనత శాతం అధికంగా
ఉన్న కారణంగా గిరిజన సంక్షేమ శాఖ ప్రత్యేక కమిషనర్ ఎం.పద్మ ప్రభుత్వానికి పంపిన ప్రతిపాదనలను పరిశీలించి ప్రభుత్వం ‘ఆదివాసి ఆరోగ్యం’ కార్యక్రమం అమలు ఆదేశాలు జారీ చేసింది. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలించి తగిన చర్యలు చేపట్టడానికి ఆరోగ్య కార్యకర్తలను ఏర్పాటు చేయటానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.