ఆంధ్రప్రదేశ్‌

మోదీ-బాబు జోడీని ఎవరూ విడదీయలేరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), జూలై 14: బిజెపి, తెలుగుదేశం పార్టీలను విడదీయలేరని రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్, టిడిపి ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య అభిప్రాయపడ్డారు. కలిసి, మెలిసి రాష్ట్ర అభివృద్ధికి కష్టపడి పనిచేస్తున్న తెలుగుదేశం, బిజెపితో విడిపోవాలని, విడాకులు ఇవ్వాలని వైఎస్సార్ సిపి కోరుకోవటం అనాగరిక ఆలోచనకు పరాకాష్టగా విజయవాడలోని టిడిపి కార్యాలయంలో శుక్రవారం జరిగిన విలేఖరుల సమావేశంలో వర్ల ఆరోపించారు. ఏ వ్యక్తిగాని, పార్టీ గాని సంసారం చేసుకుంటున్న జంటను విడదీయాలని చూడరన్నారు. కానీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆ నీచ సంస్కృతికి కూడా తెరతీసిందన్నారు. గతంలో బిజెపితో కలిసే ప్రసక్తే లేదని, మైనార్టీ ఓటు బ్యాంకు మాదేనని విర్రవీగిన వైకాపా ఈరోజు తిరోగమనానికి కారణమేంటని ధ్వజమెత్తారు. ఎన్ని కాళ్లకు మొక్కినా, ఎన్ని పొర్లుదండాలు పెట్టినా జగన్మోహన్‌రెడ్డి జైలుకు వెళ్లడం ఖాయమన్నారు.