ఆంధ్రప్రదేశ్‌

90 శాతం హామీలను నెరవేర్చిన ఘనత టిడిపిదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 14: లోటు బడ్జెట్‌లో ఉన్నప్పటికీ తెలుగుదేశం ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో ఈ మూడేళ్లలో 90 శాతానికి పైగా నెరవేర్చిందని రాష్ట్ర మంత్రి నక్కా ఆనంద్‌బాబు తెలిపారు. వైఎస్ హయాంలో మిగులు బడ్జెట్ ఉన్నప్పటికీ హామీల అమలులో ఘోరంగా విఫలమయ్యారని, 2014లో తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా రైతులకు రూ.24,500 కోట్ల రుణమాఫీ చేశామన్నారు. శుక్రవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఇప్పటికే రైతు ల ఖాతాల్లో 11,500 కోట్లు జమచేశామన్నారు. అదే విధంగా డ్వాక్రా మహిళలకు సుమారు రూ.6,500 కోట్ల వరకు మాఫీ చేశామన్నారు. తాజాగా వడ్డీ రాయితీ కింద రూ.676 కోట్లు చెల్లించాలని ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు. దీనివల్ల మొత్తం 7 లక్షల మహిళా సంఘాలకు లబ్ధి చేకూరుతుందన్నారు. అదే విధంగా పెట్టుబడి నిధిని, మిగిలిన బకాయిలను కూడా త్వరలో విడుదల చేస్తామన్నారు. వృద్ధులు, వితంతువు లు, వికలాంగులకు రూ.1000, రూ.1500 పెన్షన్‌ను ఠంచనుగా అందిస్తున్నారన్నారు. 2004లో దశలవారీగా మద్యనిషేధం చేస్తామని హామీ ఇచిన వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత దానిని విస్మరించారన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంచారన్నారు.