ఆంధ్రప్రదేశ్‌

నత్తనడకన ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 14: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మంగా చేపట్టిన ఎన్టీఆర్ గ్రామీణ గృహ నిర్మాణ పథకం అమలు నత్తనడకన సాగుతోంది. ఈ పథకానికి సంబంధించి ఉపాధి నిధుల విడుదలలో జాప్యం కారణంగా గృహ నిర్మాణంలో ఆశించిన వేగం నమోదు కావడం లేదు. ఎన్టీఆర్ గ్రామీణ గృహ నిర్మాణం కింద రెండు లక్షల గృహాలను నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు 2,492 కోట్ల రూపాయలతో అం చనాలు తయారు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సాయంతో నిర్మించే 1.45 లక్షల ఇళ్లకు ఒక్కో యూనిట్‌కు 1.5 లక్షల రూపాయలు వెచ్చించనున్నారు. ఇందు లో 95 వేల రూపాయలను ప్రభుత్వం ఇస్తుంది. మరో 55 వేల రూపాయలను ఉపాధి హామీ పథకం కింద మంజూరు చేస్తారు. మరుగుదొడ్డి కాకుండా 200 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇంటి లబ్ధిదారుడే నిర్మించుకోవాల్సి ఉంటుంది. ఒక దశ నిర్మాణం పూర్తి అయినప్పటికీ, నిధుల విడుదలలో జాప్యం కారణంగా ఇళ్ల నిర్మాణం లో జాప్యం చోటు చేసుకుంటోంది. ఉపాధి హామీ పథ కిం కింద ఒక్కో యూనిట్‌ఖు 55 వేల రూపాయల వర కూ చెల్లించాల్సి ఉంది. ఉపాధి హామీ నిధుల విడుదల లో తీవ్ర జాప్యం గృహ నిర్మాణంపై ప్రభావం చూపుతోంది. దాదాపు 400 కోట్ల రూపాయల వరకూ కేంద్రం నుంచి ఉపాధి హామీ (నరేగా) నిధులు విడుదల కావా ల్సి ఉంది. నరేగా పనుల్లో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని కొద్ది నెలల క్రితం వైకాపా ప్రజాప్రతినిధి కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడం తెలిసిందే.