ఆంధ్రప్రదేశ్‌

దోచుకోడానికే ‘దత్తత’ ఎత్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాడేరు, జూలై 14: విశాఖ మన్యంలో నిక్షిప్తమైన విలువైన బాక్సైట్ ఖనిజ సంపదను దోచుకునేందుకు ముఖ్యమంత్రి దత్తత నాటకం ఆడుతున్నారని ఎపిసిసి అధ్యక్షుడు, మాజీ మంత్రి రఘువీరారెడ్డి ఆరోపించారు. విశాఖ జిల్లా పాడేరు ఐటిడిఎ కార్యాలయం ఎదుట గిరిజన సమస్యలపై శుక్రవారం కాంగ్రెస్ నిర్వహించిన మహా ధర్నాలో ఆయన మాట్లాడుతూ అరకులోయ మండలం పెదలబుడు పంచాయతీని ముఖ్యమంత్రి దత్తత తీసుకోవడంలో ఆదివాసుల పట్ల ఉన్న ప్రేమ కానేకాదని అన్నారు. విశాఖ ఏజెన్సీలోని పదకొండు మండలాల పరిధిలో దాదాపు మూడు వేల ఆరు వందల గ్రామాలు ఉండగా కేవలం పెదలబుడు పంచాయతీని మాత్రమే దత్తత తీసుకోవడంలో గల ఆంతర్యమేమిటని ఆయన ప్రశ్నించారు.
బాక్సైట్ ఖనిజ సంపదను వెలికితీసేందుకు విదేశీ కంపెనీలతో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా పెదలబుడును దత్తత తీసుకున్నారని, దత్తత ముసుగులో ఆదివాసులను ప్రలోభాలకు గురిచేసి బాక్సైట్ తవ్వకాలు చేపట్టాలన్నది ముఖ్యమంత్రి ఆలోచనగా ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా దేశ సరిహద్దు ప్రాంతంలో రక్షణ ఉండే బోర్డర్ సెక్యూరిటీ ఫోర్సు (బి.ఎస్.ఎఫ్.)ను విశాఖ మన్యంలో ఎందుకు నియమించాల్సి వచ్చిందని ఆయన ప్రశ్నించారు.
బాక్సైట్ తవ్వకాలు సాగించే కంపెనీలకు రక్షణ కల్పించేందుకు బిఎస్‌ఎఫ్ బలగాలను నియమించారన్నారు. గిరిజనుల సంపదను దోపిడీ చేసేందుకు ముఖ్యమంత్రి దత్తత నాటకమాడి వారిని మోసం చేయాలని ప్రయత్నించారని ఆయన ఆరోపించారు. గిరిజనుల పట్ల చంద్రబాబుకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే వారి ప్రయోజనాలను ఎందుకు పట్టించుకోవడం లేదని ఆయన నిలదీసారు. విభజన చట్టంలో పేర్కొన్న గిరిజన విశ్వ విద్యాలయం ఏర్పాటు చేయడంలో తాత్సారం చేస్తున్నారని ఆయన విమర్శించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్, పోలవరం ప్రాజెక్టు, గిరిజన విశ్వవిద్యాలయం వంటి ముఖ్యమైన అంశాలను పక్కన పెట్టిన ముఖ్యమంత్రి అసెంబ్లీ స్థానాల పెంపుపై మాత్రం ప్రధానమంత్రిపై ఒత్తిడి తీసుకువస్తున్నారని ఆయన అన్నారు.

చిత్రం.. పాడేరు ఐటిడిఏ వద్ద ధర్నాలో మాట్లాడుతున్న రఘువీరారెడ్డి