ఆంధ్రప్రదేశ్‌

స్వచ్ఛ గ్రామాలకు రూ. కోటి నజరానా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, జూలై 14: రాష్ట్రంలో స్వచ్చ పంచాయితీ కార్యక్రమం కింద పారిశుద్ధ్య కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేసే గ్రామాలకు ప్రోత్సాహక బహుమతులు ఇవ్వనున్నట్లు పంచాయితీరాజ్, ఐటిశాఖ మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. కర్నూలు కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం పంచాయితీరాజ్‌శాఖ అధికారులతో అభివృద్ధి కార్యక్రమాలపై మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వచ్చ పంచాయితీ కార్యక్రమంలో మొదటి అయిదు స్థానాల్లో నిలిచే గ్రామాలకు కనిష్టంగా రూ.50 లక్షలు, గరిష్టంగా రూ.కోటి ప్రోత్సాహక బహుమతి ఇస్తామని స్పష్టం చేశారు. అలాగే రాష్ట్రంలో మొదటి 600 స్థానాలు సాధించిన గ్రామాలకు తగిన ప్రోత్సాహక నిధులు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. గ్రామాలకు సేవ చేస్తే దేవుడికి సేవ చేసినట్లేనన్న పెద్దల మాట ప్రకారం ప్రత్యేకంగా తాను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కోరి పంచాయితీరాజ్‌శాఖ తీసుకున్నానని ఆయన అన్నారు. గత 100 రోజుల్లో తనకు ఆ శాఖ అధికారుల సహకారం పూర్తి స్థాయిలో ఉండటంతో అనేక గ్రామీణ సమస్యలకు పరిష్కారం చూపగలిగానని తెలిపారు. గ్రామాల అభివృద్ధికి ఏడు నక్షత్రాల కార్యక్రమం చేపట్టామని ఆయన పేర్కొంటూ ఇందులో చివరిదైన ప్రతి కుటుంబానికి నెలకు రూ.10 వేల ఆదాయం కల్పించాలన్న లక్ష్యం ప్రధానంగా తీసుకుంటున్నామని వెల్లడించారు. పాడిపరిశ్రమ, ఉద్యానవన తోటలు, పొదుపు కార్యక్రమాలు వంటి అనేక పథకాల ద్వారా గ్రామీణులకు ప్రతి నెలా ఖచ్చితమైన ఆదాయం వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వెల్లడించారు. మొదటి నక్షత్రం సురక్షిత తాగునీరు, రెండవ నక్షత్రం ప్రతి ఇంటికి విద్యుత్, వంటగ్యాస్, మూడవది పరిశుభ్రత, నాలుగు వౌళిక వసతుల కల్పన, ఐదు అంతర్గత రహదారులు, మురుగు కాలువలు, చెట్ల పెంపకం, ఆరవ నక్షత్రం కింద భూగర్భ జలాల పెంపు, వర్మీ కంపోస్టు ఉత్పత్తి గణనీయంగా పెంచడం వంటి కార్యక్రమాలు తీసుకుంటున్నామని వెల్లడించారు. గ్రామాల అభివృద్ధికి ఎంత మేరకు ఖర్చు చేయాలన్నా సిద్ధమేనని, అయితే కొంత మంది సర్పంచులు అసలేమీ పట్టించుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని జిల్లాల్లో నరేగా నిధులు ఒక్క రూపాయి వినియోగించుకోలేదని, ఉపాధి హామీ నిధులు వినియోగించని గ్రామాలు 600 వరకు ఉన్నాయని ఆయన తెలిపారు. ఇలాంటి సర్పంచ్‌లు గ్రామాల అభివృద్ధికి ఆటంకమని మండిపడ్డారు. అందరూ సమష్టిగా రాజకీయాలను పక్కనపెట్టి పని చేస్తే గ్రామాలు అభివృద్ధి చెందడం ఖాయమని ఆయన తెలిపారు. ఇక ఇంటింటికి మరుగుదొడ్డి పథకంలో భాగంగా ఇంటి వద్ద స్థలం లేని వారి కోసం ప్రభుత్వ స్థలంలో మరుగుదొడ్డి నిర్మించి ఆ ఇంటి వారికి అప్పగిస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరు వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మించుకోవాలని సూచించారు.