ఆంధ్రప్రదేశ్‌

భూ కబ్జాలపై ఇవిగో ఆధారాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూలై 14: విశాఖ భూ కుంభకోణంపై ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఎదుట జిల్లాకు చెందిన మంత్రి అయ్యన్న పాత్రుడు శుక్రవారం హాజరయ్యారు. భూ కుంభకోణానికి సంబంధించి బాధితులే కాకుండా సమాచారం తెలిసిన వారెవరైనా తమకు ఆధారాలు సమర్పిస్తే ఆ కోణంలో కూడా తమ విచారణ జరుగుతుందని సిట్ ప్రకటించిన దృష్ట్యా మంత్రి అయ్యన్న కొన్ని డాక్యుమెంట్లు, పత్రికల్లో వచ్చిన కథానాల క్లిప్పింగులను సిట్ అధికారి వినీత్ బ్రిజ్‌లాల్‌కు అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ విశాఖ నగర శివారు ప్రాంతాల్లో చోటుచేసుకున్న పలు ప్రభుత్వ, ప్రైవేటు భూముల కబ్జాలకు సంబంధించి తన వద్దనున్న ప్రాథమిక సమాచారాన్ని సిట్ అధిపతికి అందించినట్టు వెల్లడించారు. సుమారు 1,600 ఎకరాల వరకూ భూముల రికార్డులు ట్యాంపరింగ్, కబ్జా జరిగినట్టు తనవద్ద సమాచారం ఉందన్నారు. కొంతమంది ప్రభుత్వ భూములు, రహదార్లను సైతం బ్యాంకుల్లో తనఖాపెట్టి రుణాలు తీసుకున్నారని, సుమారు రూ.190 కోట్లు ఈ విధంగా బ్యాంకులు మోసపోయినట్టు బ్యాంకర్లే పేర్కొంటున్నారన్నారు. ఎవరు పాత్ర ధారులు, ఎవరు సూత్రధారులన్న అంశాలను సిట్ విచారణ బృందం తేలుస్తుందన్నారు. పెదగంట్యాడలో మెడ్‌సిటీ నిమిత్తం భూములను సేకరించే క్రమంలో పలు అక్రమాలు చోటుచేసుకున్నాయని, ప్రభుత్వ భూములు తమవిగా రికార్డులు మార్చి నష్టపరిహారం పొందారని ఆరోపించారు. రెండు సార్లు కలెక్టర్‌కు లేఖలు రాశానని, ముఖ్యమంత్రికి కూడా లేఖ రాశానని స్పష్టం చేశారు. ఈ నెల 19న మరోసారి సిట్ బృందాన్ని కలిసి మరికొన్ని నివేదికలు సమర్పిస్తానని తెలిపారు. సిట్ విచారణపై తనకు పూర్తి నమ్మకం ఉందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

చిత్రం.. భూ కుంభకోణంపై ఆధారాలు అందజేస్తున్న మంత్రి అయ్యన్న