ఆంధ్రప్రదేశ్‌

అమృత్‌లో మరో ఐదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 8: పట్టణాల్లో వౌలిక సదుపాయాల కల్పనను శరవేగంగా చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అటల్ మిషన్ ఫర్ రిజువనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్‌ఫర్మేషన్ (అమృత్) కింద ఎంపికైన రాష్ట్రంలోని 31 పట్టణాల్లో వౌలిక వసతుల కల్పనపై దృష్టి పెట్టాలని అధికారులను సిఎం కోరారు. రాష్ట్రంలో అమృత్ పథకం అమలు తీరును ముఖ్యమంత్రి ఆదివారం తన క్యాంప్ కార్యాలయంలో సమీక్షించారు. వచ్చే మూడేళ్లలో అమృత్ పట్టణాల్లో వంద శాతం రహదారుల నిర్మాణం, మురుగు నీటిపారుదల వ్యవస్థను పూర్తి చేయడం, ప్రతి ఇంటికి తాగునీటి సరఫరా, పట్టణ పేదలకు గృహ నిర్మాణం, పారిశుధ్యం అమలుతోపాటు పచ్చదనం పెంపొందించాలని అధికారులను ఆదేశాంచారు. సిబ్బంది కొరత ఉంటే ముందుగా 11 మున్సిపాలిటీల్లో పథకాన్ని అమలు చేసి, క్రమంగా మిగిలిన మున్సిపాలిటీల్లో విస్తరించాలని ఆయన సూచించారు. పట్టణాభివృద్ధికి సంబంధించిన ప్రాజెక్ట్‌ల రూపకల్పన చేయాలని ఆయన సూచించారు. అవసరమైతే కన్సల్టెన్సీని ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. అమృత్ పథకంపై ఇకపై నిరంతర సమీక్ష జరుపుతామని ఆయన చెప్పారు. పట్టణాల అభివృద్ధికి అన్ని ప్రభుత్వ శాఖలను సమీకృతం చేసి ఏకీకృత వ్యవస్థను, విధానాన్ని అమలులోకి తీసుకువస్తామని సిఎం చెప్పారు. ఇందుకోసం మున్సిపాలిటీల ఆదాయ వనరులు ఏవిధంగా ఉన్నాయన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని ఆయన సూచించారు. లక్ష జనాభా ఉన్న పట్టణ ప్రజల్లో సంతృప్తి శాతం పెరిగేలా జూన్ నాటికి పెర్ఫార్మెన్స్ రేటింగ్ ఉండాలని ఆదేశించారు. రాష్ట్రంలో 31 పట్టణాలను అమృత్ పథకం కింద అమలు చేసినప్పటికీ, వీటిని మరో ఐదు పట్టణాలకు విస్తరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. ఈ 36 పట్టణాల్లో అవసరమైన సిబ్బందిని ఔట్‌సోర్సింగ్ ద్వారా నియమించుకోడానికి ఆయన అనుమతి మంజూరు చేశారు. పట్టణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా, భవనాలకు ఆన్‌లైన్‌లో అనుమతులు, వాన నీటి సంరక్షణ అంశాల పురోగతిని చంద్రబాబు సమీక్షించారు. పట్టణాల్లో 150 రోజుల్లో కుక్కలను నియంత్రించాలని చంద్రబాబు ఆదేశించారు. ఈ సమావేశంలో మున్సిపల్ మంత్రి నారాయణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టక్కర్, ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్, ప్రిన్సిపల్ సెక్రటరీ సతీష్ చంద్ర తదితరులు పాల్గొన్నారు.