ఆంధ్రప్రదేశ్‌

తిరుమల లడ్డూలో నల్లజెర్రి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పార్వతీపురం, మే 9: తిరుమల వెంకన్న లడ్డూలో నల్లజెర్రి కనిపించడంతో ఓ భక్తుడు కలవరపడ్డాడు. ఈ సంఘటన విజయనగరం జిల్లా పార్వతీపురంలో సోమవారం వెలుగుచూసింది. వివరాలు ఇలా ఉన్నాయి. పార్వతీపురం పట్టణంలోని రామాపురం కాలనీకి చెందిన గౌరీ పట్టాపుదేవీప్రసాద్ కుటుంబసభ్యులతో కలిసి ఈనెల 3న తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి దర్శనం చేసుకుని 4న ఇంటికి చేరుకున్నాడు. వెంట వెంకన్నస్వామి ప్రసాదం లడ్డూలు తెచ్చుకున్నాడు. పెళ్లిళ్లు, పేరంటాళ్లు ఉండడంతో ఇతర ప్రాంతాలకు వెళ్లి ఆదివారం ఇంటికి చేరుకున్నారు. బంధువులకు ప్రసాదం ఇచ్చేందుకై సోమవారం ఓ లడ్డూ తీసి ముక్కలు చేస్తుండగా చచ్చిన నల్లజెర్రి కనిపించడంతో కలవరపడ్డాడు. దేవాలయంలో లడ్డూలు చేసేవారు అప్రమత్తంగా ఉండాలని, లేకుంటే ఇలాంటి సంఘటనలు జరిగితే లడ్డూల ప్రాధాన్యత, స్వామివారి విశిష్టత దెబ్బతింటుందని పేర్కొన్నాడు.