ఆంధ్రప్రదేశ్‌

ఎయిర్‌లైన్స్ వాదన విన్నాకే నిర్ణయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 17: ఎయిర్‌లైన్స్ వాదనలు విన్న తర్వాతనే నిర్ణయం ప్రకటిస్తామని జెసి దివాకర్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు సోమవారం స్పష్టం చేసింది. దివాకర్‌రెడ్డి తరపున న్యాయవాదులు డివి సీతారామ మూర్తి, ఎన్ రంగారెడ్డి దాఖలు చేసిన పిటిషన్లను స్వీకరించిన జస్టిస్ ఎస్వీ భట్ విమానయాన శాఖకు, ఎయిర్ ఇండియా, జెట్ ఎయిర్‌వేస్, విస్తారా ఎయిర్‌లైన్స్, గో ఎయిర్, ఎయిర్ ఏషియా, స్పైస్ జెట్, టర్బో మేఘా ఎయిర్‌లైన్స్‌కు ఇ-మెయిల్, స్పీడ్ పోస్టు ద్వారా నోటీసులు జారీ చేశారు. తమ పిటిషనర్‌కు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, కనీసం ఆయన వాదన వినకుండా విమానాల్లో ప్రయాణాలపై నిషేధం విధించడం దారుణమని పేర్కొన్నారు. దివాకర్‌రెడ్డి ఇటు పార్లమెంటు సమావేశాలకు ఇతర కీలక సమావేశాలకు హాజరుకావాల్సి ఉందని వారు న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. విశాఖపట్టణం ఘటన దురదృష్టకరమని, ఆయనపై విధించిన నిషేధాన్ని న్యాయస్థానం తొలగించాలని కోరారు.