ఆంధ్రప్రదేశ్‌

బిసి కమిషన్ ఎదుట కాపు, బిసి నేతల పోటాపోటీ నినాదాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 21: మరికొద్ది రోజుల్లో బిసి కమిషన్ తన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించబోతున్న నేపథ్యంలో సందర్శకులతో స్థానిక బిసి కమిషన్ కార్యాలయంలో రద్దీ పెరుగుతోంది. కాపు సంఘాల నేతలు, బిసి సంఘాల నేతలు శుక్రవారం ఒకేసారి బిసి కమిషన్ కార్యాలయానికి చేరుకోటంతో కొద్దిసేపు స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. కాపులను బిసిల్లో చేర్చాలని కాపు నేతలు, కాపులను చేర్చవద్దంటూ బిసి నేతలు కార్యాలయం వెలుపల పోటా పోటీగా నినాదాలు ఇచ్చి కమిషన్ చైర్మన్ జస్టిస్ మంజునాథ్‌కు వినతిపత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా కాపు సంఘాల నేతలు నగర కాంగ్రెస్ అధ్యక్షుడు ఆకుల శ్రీనివాస్, పిసిసి ప్రధాన కార్యదర్శి, న్యాయవాది నరహరిశెట్టి నరసింహారావు మాట్లాడుతూ సిఎం చంద్రబాబు గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని కోరారు. కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం పాదయాత్రను అడ్డుకుంటే సహించేది లేదన్నారు. ఇచ్చిన హామీని అమలు చేయకుండా చంద్రబాబు కాపులను మోసం చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. బిసి సంఘాల నేతలు, న్యాయవాది వై కోటేశ్వరరావు, సాంబశివరావు, చక్రవర్తి మాట్లాడుతూ కాపు, బిసిల మధ్య చంద్రబాబు చిచ్చు పెడుతున్నారంటూ మండిపడ్డారు. ఓట్ల కోసమే కాపులను బిసిల్లో చేరుస్తామని హామీ నిచ్చారంటూ వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతారని అన్నారు. కాపులు ఆర్థికంగా ఎంతో ఉన్నత స్థితిలో ఉన్నందున వారిని బిసిల్లో చేరిస్తే బిసిలు అన్ని విధాలుగా నష్టపోతారని అన్నారు. ఈ సందర్భంగా బిసి కమిషన్ చైర్మన్ జస్టిస్ మంజునాథ్ మాట్లాడుతూ కాపు రిజర్వేషన్లపై శాస్ర్తియంగా అధ్యయనం చేస్తున్నామన్నారు. ఇందుకు సంబంధించి 13 జిల్లాల్లో ప్రజాభిప్రాయాన్ని సేకరించామని తమ నివేదిక తుది దశలో ఉందని, దీనిపై ప్రభుత్వమే ఒక నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. రాజ్యాంగానికి మించి రిజర్వేషన్లు కల్పించటం వీలుకాదని 64 కులాలకు సంబంధించిన కేసులు పెండింగ్‌లో ఉన్నాయని అన్నారు. వీటిని పరిష్కరించేందుకు తాము అన్ని జిల్లాల్లో పర్యటించామన్నారు. కొన్ని కులాలు బిసి జాబితా నుంచి ఎస్‌టిల్లో చేర్చాలని కోరుతున్నారు. త్వరలో నివేదికను ప్రభుత్వానికి అందచేస్తామన్నారు. మూడు మాసాల్లో తమ నివేదిక ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.