ఆంధ్రప్రదేశ్‌

ఇంజనీరింగ్‌లో 21 వేల సీట్లు ఖాళీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 21: రాష్ట్రంలోని వివిధ ఇంజనీరింగ్ కళాశాలల్లో మొదటి విడత ఎంసెట్ కౌనె్సలింగ్ తరువాత 21 వేల సీట్లు భర్తీ కాకుండా మిగిలిపోయాయి. రెండో విడత కౌనె్సలింగ్‌కు సంబంధించి వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్రంలోని చాలా ఇంజనీరింగ్ కళాశాలల్లో విద్యాప్రమాణాలు నాసిరకంగా ఉండటంతో కొన్ని కళాశాల్లో చేరేందుకు విద్యార్థులు విముఖత చూపిస్తున్నారు. గతంలో ఇంజనీరింగ్ కోర్సుల్లో చేరేందుకు భారీగా డిమాండ్ ఉండటంతో అధిక సంఖ్యలో ఇంజనీరింగ్ కళాశాలలు ఏర్పాటయ్యాయి. అయితే ప్రభుత్వ పర్యవేక్షణ నామామాత్రంగా ఉండటంతో ప్రమాణాలు కూడా అదే తీరులో ఉన్నాయన్న విమర్శలు ఉన్నాయి. దీంతో కొన్ని కళాశాలలు విద్యార్థుల కోసం ఎదురుచూస్తున్నాయి. ఎంసెట్-2017కు 1.30 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేయగా, అందులో 74,923 మంది విద్యార్థులు అర్హత సాధించారు. తొలిదశ కౌనె్సలింగ్ తరువాత దాదాపు 21 వేల సీట్లు కన్వీనర్ కోటా కింద మిగిలిపోయాయి. ప్రభుత్వ ఇంజనీరింగ్, వర్సిటీ కళాశాలల్లో 4,466 సీట్లు ఉండగా, 1,174 సీట్లు భర్తీ కాలేదు. ప్రైవేట్ కళాశాలల్లో దాదాపు 20 వేల సీట్లు మిగిలిపోయాయి. ప్రభుత్వ వర్సిటీల్లోని ఇంజనీరింగ్ కళాశాలల్లో చేరేందుకు విద్యార్థులు ఎక్కువగా ఇష్టపడతారు. అయితే మారిన పరిస్థితుల్లో సీటు లభించినప్పటికీ ఆ కళాశాలల్లో చేరేందుకు విముఖత వ్యక్తం చేస్తున్నారు. ఘన చరిత్ర, వౌలిక సదుపాయాలు, అత్యున్నత ఫ్యాకల్టీ ఉన్నప్పటికీ, వర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలల్లో చేరేందుకు ముందుకు రాకపోవడం ఈ కళాశాలల దుస్థితికి అద్దం పడుతోంది. ప్రైవేట్ వర్సిటీల తరహా వర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్లేస్‌మెంట్, కెరీర్ అస్స్యూరెన్సు ప్యాకేజీలు లేకపోవడంతో వర్సిటీల్లోని ఇంజనీరింగ్ కళాశాలలకు డిమాండ్ తగ్గుతోంది. ఇలావుండగా ఐఐటి, నిట్, తదితర ప్రముఖ సంస్థల్లో సీట్లు రావడం వల్లే వర్సిటీ ఇంజనీరింగ్ కళశాలల్లో చేరడం లేదని అధికారులు అంటున్నారు.