ఆంధ్రప్రదేశ్‌

ఫిర్యాదుల స్వీకరణకు గడువు పెంచాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూలై 22: విశాఖ భూ కుంభకోణంపై విచారణ నిమిత్తం ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను బిజెపి శాసనసభ పక్ష నేత పి విష్ణుకుమార్ రాజు శనివారం కలిశారు. సిట్ ఉన్నతాధికారి వినీత్ బ్రిజ్‌లాల్‌ను స్వయంగా కలిసి పలు అంశాలపై తన వద్దనున్న ఆధారాలను అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ విశాఖ జిల్లాకు సంబంధించి భీమునిపట్నం మండలం చిట్టివలసలో 41 ఎకరాలకు సంబంధించి ప్రైవేటు వ్యక్తులకు సంబంధించిన భూముల రికార్డులు ట్యాంపరింగ్ చేశారని, దీనికి అధికారులు సహకరించారని ఆధారాలతో సహా సిట్‌కు వివరించారు. అలాగే పాయకరావు పేట మండలం రాజవరం గ్రామంలో సర్వేనెంబర్ 126/1,2,345.73 ఎకరాలు, 146 సర్వే నెంబర్‌లో 99.85 ఎకరాల భూమిని కొంతమంది రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు ఇతర వ్యక్తులకు దఖలు పడేలా రికార్డులు మార్చేశారని పేర్కొన్నారు. పెందుర్తి మండలం ముదపాక గ్రామంలో వందల ఎకరాల ప్రభుత్వ భూములను పట్టాదార్ల నుంచి బలవంతంగా స్వాధీనం చేసుకున్న సంఘటనపై కూడా తాను సిట్‌కు ఫిర్యాదు చేశానన్నారు. అలాగే నగర పరధిలోని మాధవధార సర్వే నెంబర్ 13/3లో 2.08 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైనా అధికారులు స్పందించలేదని ఆరోపించారు. ఈ భూములకు సంబంధించి కోర్టులో కౌంటర్ కూడా దాఖలు చేయకుండా అధికారులు కబ్జాదార్లకు సహకరించారని ఆరోపించారు. ప్రభుత్వం గవర్నమెంట్ ప్లీడర్ల నియామకంలో ప్రజా ప్రతినిధుల ఒత్తిడులకు తలొగ్గడం వల్లే న్యాయస్థానాల్లో ప్రభుత్వ పరంగా సరైన వాదనలు వినిపించలేని పరిస్థితులు నెలకొన్నాయన్నారు. ఈ విధానం మారాలని, అర్హులనే నియమించాలని సూచించారు. ఇక సిట్ ఏర్పాటు చేసిన అనంతరం కబ్జాలకు సంబంధించి ఫిర్యాదులు వెల్లువెత్తాయని, వీటిని పరిశీలించి, పరిష్కరించడం పరిమిత సిబ్బందితో కూడిన సిట్ బృందానికి అసాధ్యమన్నారు. విచారణ నిమిత్తం మరో బృందాన్ని నియమించడం ద్వారా బాధితులకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. భూ కబ్జాలు, భూ రికార్డుల తారుమారు అంశాలకు సంబంధించి సిట్‌కు ఇప్పటికే 2,500 వరకూ ఫిర్యాదులు అందాయని, గడువు ముగిసిపోవడంతో ఇంకా పలువురు బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించట్లేదన్నారు. సిట్ ఫిర్యాదుల స్వీకరణ గడువును మరికొన్ని రోజులు పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిట్‌కు అందిని ఫిర్యాదుల్లో కొన్ని న్యాయస్థానాల్లో వ్యాజ్యాలు నడుస్తున్నాయని, వీటిని పరిష్కరించేందుకు ప్రభుత్వం ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ భూముల రికార్డుల ట్యాంపరింగ్ విషయంలో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణపై కేసు నమోదు విషయమై రాజు స్పందిస్తూ అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేపై కేసు నమోదు చేయడం ద్వారా తమకు అంతా ఒక్కటే అన్న సందేశం పంపే ప్రయత్నం చేస్తున్నట్టు అనిపిస్తోందన్నారు.

చిత్రం.. వినీత్ బ్రిజ్‌లాల్‌కు భూ కబ్జాలకు సంబంధించి ఆధారాలు అందజేస్తున్న బిజెఎల్పీ నేత విష్ణుకుమార్ రాజు