ఆంధ్రప్రదేశ్‌

దళితులపై దాడుల్లో రెండో స్థానంలో ఏపి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 22: దళితులపై జరుగుతున్న దాడుల్లో ఎపి రెండో స్థానంలో ఉందని వైఎస్‌ఆర్‌సిపి పార్లమెంటు సభ్యుడు వైవి సుబ్బారెడ్డి అన్నారు. చంద్రబాబు పాలనలో దళితులపై దాడులు పెరిగిపోయాయని ఆరోపించారు. శనివారం నాడిక్కడ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2015 నేషనల్ క్రైం రికార్డ్సు బ్యూరో నివేదిక ప్రకారం ఎపిలో 4,415 మంది దళితులపై కేసులు నమోదైతే, 4,455 మంది బాధితులుగా ఉన్నారన్నారు. 330 మంది మహిళలపై దాడులు జరిగితే అందులో 100 మంది దళితులే ఉన్నారని గుర్తు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా తుందుర్రులో అక్వాఫుడ్‌కు వ్యతిరేకంగా చేస్తున్న ఉద్యమంపై పోలీసులు దుర్మార్గంగా దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. అక్వా పరిశ్రమను జనావాసాల మధ్య కాకుండా సముద్ర తీరానికి తరలించాలని ప్రతిపక్ష నేత జగన్ కూడా ఒత్తిడి తెచ్చారని తెలిపారు. అయినా ప్రభుత్వం మొండి వైఖరితో నిరంకుశంగా వ్యవహరిస్తోందన్నారు. గరగపర్రులో దళితులు, అగ్రవర్ణాల గొడవను జగన్ సామరస్యంగా పరిష్కరించారని గుర్తు చేశారు. ప్రకాశం జిల్లా దేవరపల్లి ఘటనపై కేంద్రానికి ఫిర్యాదు చేశానని తెలిపారు. కేంద్రహోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్, ఎస్సీ కులాల జాతీయ కమిషన్ చైర్మన్ రమాశంకర్ కతార్‌ను కలిసి దేవరపల్లి ఘటన గురించి వివరించామని తెలిపారు. వారు సానుకూలంగా స్పందించి కలెక్టర్ నుంచి నివేదిక తీసుకుని పరిశీలిస్తామని చెప్పారని సుబ్బారెడ్డి చెప్పారు.