ఆంధ్రప్రదేశ్‌

ప్రైవేట్ జూ.కాలేజీలపై భారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 23: 2017-18 విద్యా సంవత్సరం ఆరంభమై విద్యాసంస్థల్లో త్రైమాసిక పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధమవుతుంటే ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో వేలాది మంది విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ప్రస్తుతం ఇంటర్మీడియట్ బోర్డు, కళాశాలల యాజమాన్యాల మధ్య వార్ నడుస్తోంది. రాష్టవ్య్రాప్తంగా దాదాపు 3 వేల ప్రైవేట్ జూనియర్ కళాశాలలు నడుస్తున్నాయి. ప్రతి ఏటా ప్రథమ సంవత్సరంలో చేరే విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని విద్యా సంవత్సరం ఆరంభానికి ముందుగానే ప్రతి కళాశాల ప్రథమ సంవత్సరంలో ప్రారంభించబోయే సెక్షన్లను బట్టి నిర్ణీత అనుబంధ ఫీజు చెల్లించాల్సి ఉంది. అయితే ఈ ఏడాది ప్రభుత్వం ఏ ఒక్కరితోనూ సంప్రదించకుండానే ఒకేసారి 300 శాతం పెంచడంపై కళాశాలల యాజమాన్యాలు గగ్గోలు పెడుతున్నాయి. నిన్నటివరకు గ్రామీణ ప్రాంతాల్లో సెక్షన్‌కు రూ.1500లు, పట్టణాల్లో రూ. 5వేలు, నగరాల్లో రూ. 6వేలు చెల్లించాల్సి వచ్చేది. తాజా పెంపుదలతో రూ.4,500లు, రూ. 15వేలు, రూ. 18వేలు చెల్లించాల్సి రావటాన్ని తీవ్రంగా నిరసిస్తూ వచ్చారు. పెంచిన రేటు తగ్గించాలంటూ బోర్డు కార్యదర్శి, విద్యాశాఖ మంత్రి, చివరకు ముఖ్య మంత్రికి కూడా ఎన్నోసార్లు వినతిపత్రాలు అందచేశారు. అయితే నయాపైసా తగ్గలేదు గాని తొలుత ఏప్రిల్ వరకు, ఆపై మే మాసాంతం వరకు ఫీజు చెల్లింపునకు గడువు ఇస్తూ వచ్చారు. తర్వాత రూ. 10వేలు జరిమానా విధించారు. మళ్లీ దాన్ని రూ. 20వేలకు పెంచారు. జరిమానా చెల్లింపు గడువు కూడా జూన్ మాసాంతంతో ముగిసింది. మొత్తంపై 2700 కళాశాలలకు గాను 70 శాతం యాజమాన్యాలు మాత్రం చెల్లించినట్లు తెలుస్తోంది. మిగిలిన కళాశాలల్లో విద్యార్థుల అడ్మిషన్లను బోర్డు అనుమతించలేదు. దీంతో వీరి పరిస్థితి జీవన్మరణ సమస్యగా మారింది. ఇదిలావుంటే తాజాగా అదే కళాశాలల్లో ద్వితీయ సంవత్సరం చదివే విద్యార్థుల స్కాలర్‌షిప్‌లను కూడా బోర్డు నిలిపివేసిందని ప్రైవేట్ జూనియర్ కళాశాలల యాజమాన్యాల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బైరపనేని సూర్యనారాయణ ‘ఆంధ్రభూమి’ ప్రతినిధికి తెలిపారు. ఈ చర్య దారుణమన్నారు. విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు మాత్రం రుసుం చెల్లింపు గడువును ఆగస్టు 5 వరకు పెంచినట్లు ప్రకటించారు. ఈమేరకు బోర్డు నుంచి ఉత్తర్వులు కూడా వెలువడ్డాయి. అయినా తాము ఇంతకాలం గడువు కోసం విజ్ఞాపనలు చేయటం లేదని, పెంచిన శాతం తగ్గించమనే కోరుతున్నామని యాజమాన్యాలు చెబుతుంటే బోర్డు మాత్రం అది తమ పరిధిలో లేదని చెబుతోంది. విద్యార్థుల నుంచి వసూలు చేయాల్సిన ఫీజులను మాత్రం బోర్డు నిర్ణయిస్తుంది. ప్రతి ఏటా 10 శాతం పెంపుదలకు అంగీకరిస్తున్న బోర్డు తాము చెల్లించాల్సిన అనుబంధ రుసుమును ఒకేసారిగా 300 శాతం పెంచటం ఏమి న్యాయమని సూర్యనారాయణ ప్రశ్నించారు. వాస్తవానికి విద్యాశాఖ మంత్రి 2015 అక్టోబర్‌లోనే ఈ పెంపుదలను అమల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయగా యాజమాన్యాలు 2016లోనూ అమలుకాకుండా అడ్డుకోగలిగాయి. ఒక్క సంవత్సరానికి మినహాయింపు ఇస్తున్నామని చెబుతూ 2017 నుంచి అమల్లోకి తెచ్చినట్లు బోర్డు అధికారులు చెబుతున్నారు.