ఆంధ్రప్రదేశ్‌

ఇకనుంచి అన్నీ ఆన్‌లైన్ పరీక్షలే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మే 10: వచ్చే ఏడాది నుంచి అన్ని పరీక్షలు ఆన్‌లైన్‌లో నిర్వహిస్తామని మానవవనరుల అభివృద్ధిశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్రంలోని వివిధ పాఠశాలల్లో రూ. 5 వేల కోట్లతో వౌలిక వసతులు అభివృద్ధి చేయనున్నట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఉపాధ్యాయులకు బయోమెట్రిక్ అటెండెన్సు అమలు చేస్తామన్నారు. విశాఖపట్నంలో మంగళవారం పదవతరగతి పరీక్ష ఫలితాలు విడుదల చేసిన సందర్భంగా మంత్రి విలేఖరులతో మాట్లాడుతూ పాఠశాలల్లో వౌలిక వసతుల అభివృద్ధికి రూ.10 వేల కోట్లు కేటాయించాలని ముఖ్యమంత్రిని కోరగా తొలి విడతగా రూ. 5వేల కోట్లు కేటాయించేందుకు అంగీకరించారన్నారు. ఈ నిధులతో పాఠశాలల్లో ఫర్నిచర్, వంటషెడ్ల నిర్మాణం, మరుగుదొడ్లు, ప్రహరీల నిర్మాణం చేపడతామన్నారు. వివిధ న్యాయపరమైన అంశాల కారణంగా ఇప్పటివరకు డిఎస్సీ నియామకాలు చేపట్టలేదన్నారు. ఆ వివాదాలన్నింటిని పరిష్కరించామని, జూన్ 1 నుంచి నియామక ఉత్తర్వులు అందచేస్తామన్నారు. వీరికి 15 రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించే కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తోందని మంత్రి తెలిపారు. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి 10 తరగతిలో సిసిఇ (కంటిన్యువస్ అండ్ కాంప్రహెన్సిల్ ఇవాల్యేషన్) విధానం అమలు చేస్తున్నామన్నారు.
వచ్చే సంవత్సరం నుంచి రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ పరీక్షలు, ప్రవేశ పరీక్షలను ఆన్‌లైన్‌లో నిర్వహించేందుకు గల సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు ఒక కమిటీని నియమించినట్లు మంత్రి తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి కెజి నుంచి పీజీ వరకూ అన్ని స్థాయిలో ఉపాధ్యాయులకు బయోమెట్రిక్ అటెండెన్సు విధానం అమల్లోకి తీసుకురానున్నట్లు ఒక ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. ప్రయోగాత్మకంగా డైట్‌సెట్‌ను ఈనెల 17 నుంచి 19 వరకూ ఆన్‌లైన్‌లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సంధ్యారాణి తెలిపారు.

కోట్లకు పడగెత్తిన తహశీల్దార్
ఏసిబి దాడుల్లో బయటపడ్డ అక్రమార్జన
హిందూపురం, మే 10: అనంతపురం జిల్లా ఓబుళదేవరచెరువు తహశీల్దార్ జానకి రత్నమయ్య ఆస్తులపై అవినీతి నిరోధక శాఖ అధికారులు మంగళవారం ఉదయం ఏక కాలంలో ఎనిమిది చోట్ల ఆకస్మిక దాడులు నిర్వహించి ఆయన అక్రమార్జనను బట్టబయలు చేశారు. రెవెన్యూ శాఖలో దిగువ స్థాయి నుండి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పనిచేసిన రత్నమయ్యపై ఏసిబి అధికారులకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందడంతో ఆకస్మిక దాడులు నిర్వహించారు. అనంతపురం ఎసిబి డిఎస్పీ భాస్కర్‌రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మంగళవారం రత్నమయ్య బంధువులు, కుటుంబ సభ్యుల ఇళ్లపై ఏకకాలంలో దాడులకు ఉపక్రమించారు. హిందూపురం, అనంతపురం, బెంగళూరు, ఓడిసి, తాడిమర్రి మండలం మద్దలచెరువు, తదితర ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. హిందూపురంలో రెండు అంతస్తుల నివాస భవనంతోపాటు 12 ప్రాంతాల్లో విలువైన స్థలాలు గుర్తించారు. బెంగళూరులో ఐదు, మూడు అంతస్తుల భవనాలు, ఇంటి స్థలాలు బయటపడ్డాయ. హిందూపురం సమీపంలో 2.20 ఎకరాల వ్యవసాయ భూములు, మారుతీ కారు, ద్విచక్ర వాహనం కలిగి ఉన్నాడు. ఇకపోతే ఇంట్లో రూ.1.28 లక్షల నగదు, 25 తులాల బంగారం, కిలో వెండి ఎసిబి అధికారులు సీజ్ చేశారు. అదే విధంగా బ్యాంక్ ఖాతాల్లో రూ.5 లక్షల నగదు, ఎల్‌ఐసి పాలసీల కింద రూ.లక్ష నిలువ ఉన్నట్లు గుర్తించారు. రత్నమయ్య తహశీల్దార్‌గా పనిచేస్తుండగా భార్య ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నప్పటికీ అక్రమ వడ్డీ వ్యాపారాన్ని సాగిస్తున్నట్లు తనిఖీల్లో వెల్లడయింది. రూ.62 లక్షలకు సంబంధించి ప్రాంసరీ నోట్లు, రుణాలు ఇచ్చిన చెక్కులను కూడా ఎసిబి అధికారులు గుర్తించారు. ఆయా ఆస్తుల విలువ రూ.3.11 కోట్లు ఉన్నట్లు ఎసిబి డిఎస్పీ భాస్కర్‌రెడ్డి వివరించారు. ఇందులో రూ.2.50 కోట్లు అక్రమ సంపాదనగా ఆయన వెల్లడించారు.

పాలేరులో మా వెంటే ప్రజలు
కాంగ్రెస్ నేతలు ఇనగాలి, వివేక్, పొన్నం
ఖమ్మం, మే 10: పాలేరు ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ప్రజలు మద్దతునిస్తున్నారని, విజయం తమదేనని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇనగాలి వెంకట్రామిరెడ్డి, మాజీ ఎంపిలు వివేక్, పొన్నం ప్రభాకర్‌లు ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం తిరుమలాయపాలెం మండల పరిధిలోని తిప్పారెడ్డిగూడెం, అజ్మీరతండా, తిరుమలాయపాలెం గ్రామాల్లో కాంగ్రెస్ అభ్యర్తి సుచరితకు మద్దతుగా విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుమలాయపాలెంలో పార్టీ మండల నాయకులు, కార్యకర్తలతో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ పార్టీ నేతలు కాంగ్రెస్ పార్టీ విధానాలను రాంరెడ్డి వెంకటరెడ్డి చేసిన సేవలను తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ గురించి తెలియ చేయాలన్నారు. పాలేరు నియోజకవర్గంలో ప్రజలు కాంగ్రెస్ వెంటే ఉన్నారని, నాయకులంతా ఐక్యంగా అధికారపార్టీ నేతల మాటలను నమ్మవద్దని ప్రజలకు చెప్పాలన్నారు. పాలేరు నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉందని, దానిని నిలబెట్టాల్సిన బాధ్యత కార్యకర్తలపైనే ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం ప్రజలు ఉద్యమిస్తే దానిని అర్థం చేసుకొని తమ నేత సోనియాగాంధీ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. రాష్ట్ర ఏర్పాటు వల్ల పార్టీకి ఇతర ప్రాంతాల్లో నష్టం జరుగుతుందని తెలిసినా ప్రజల ఆకాంక్షలకే ఆమె పెద్దపీఠ వేశారన్నారు. సమావేశంలో పార్టీ మండలాధ్యక్షుడు బెల్లం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

దోచేయడంలోనే ముందంజ
సిఎం చంద్రబాబుపై రఘువీరా ధ్వజం
శెట్టూరు, మే 10: ప్రజాధనాన్ని దోచుకోవటంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ముందంజలో ఉన్నారని పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి ధ్వజమెత్తారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక నిర్ణయాలకు నిరసనగా అనంతపురం జిల్లా శెట్టూరులో మంగళవారం జరిగిన ధర్నాలో రఘువీరా మాట్లాడుతూ రాష్ట్రంలోని 13 జిల్లాల ప్రజలకు అవసరమయ్యే బడ్జెట్ లేదులేదంటూనే, తన అవసరాలకు, తన క్యాంప్ కార్యాలయానికి, తన పార్టీ ప్రచారానికి భారీగా బడ్జెట్ కేటాయించి, ప్రజాధనాన్ని దోచేస్తున్నారన్నారు. వలసల నివారణ కోసం గత యుపిఏ హయాంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకాన్ని ప్రవేశ పెట్టి కరవును అధిగమించామన్నారు. నేడు రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలో ఉన్న టిడిపి, బిజెపిలు ఆ పధకాన్ని నిర్వీర్యం చేసి పేదల బతుకులను ఛిద్రం చేయడానికి కంకణం కట్టుకున్నాయన్నారు. ఎక్కడ చూసినా వెళ్లినా తాళాలు వేసిన వాకిళ్లే కనపడుతున్నాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల మంది ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళితే అందులో మన అనంతపురం జిల్లానుంచే 6 లక్షల మంది ఉన్నారన్నారు. పశుగ్రాసం లేక పశువులను కబేళాలకు తరలిస్తున్నారని వెంటనే పాలకులు స్పందించి ప్రతి మండల కేంద్రంలో ఉచితంగా పశుగ్రాస కేంద్రాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ సిఎం కేసీఆర్ ప్రభుత్వం చట్టానికి విరుద్ధంగా ఆనకట్టలు నిర్మిస్తుంటే బాబు పల్లెత్తు మాట అనకపోవటంలో ఆంతర్యం ఏమిటన్నారు.