ఆంధ్రప్రదేశ్‌

మనోళ్లను ఎందుకు పక్కన పెట్టారు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 10: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని నిర్మాణ విషయంలో నేల విడిచి సాము చేస్తున్నారనడంలో ఏమాత్రం సందేహం లేదు. అంతర్జాతీయ ప్రమాణాలతో రాజధానిని నిర్మించాలని భావిస్తున్నారు. ఇందుకు వివిధ దేశాల నుంచి ఆర్కిటెక్ట్‌లతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇప్పటికే సింగపూర్, జపాన్, యుకే వంటి అనేక దేశాల్లో చంద్రబాబు నాయుడు పర్యటించడం, ఆయా దేశాల్లో వివిధ సంస్థలన సంప్రదించడం జరిగిపోయింది. ఈమేరకే రాజధాని నిర్మాణంలో విదేశీ సంస్థలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్టు కనిపిస్తోంది. వాస్తవానికి భారత దేశంలో వాస్తు పరంగా అద్భుత భవనాలను నిర్మించగల ఆర్కిటెక్ట్‌లు అనేక మంది ఉన్నారు. ఫాదర్ ఆఫ్ ఆర్కిటెక్ట్స్‌గా పిలవబడే బివి దోష్ వంటి అనేక మంది నిపుణులు ఉన్నప్పటికీ వారిని ప్రభుత్వం ఎందుకు పరిగణలోకి తీసుకోవడం లేదు? గత ఏడాది జూలైలో సీడ్ క్యాపిటల్ మాస్టర్‌ను సిఎం చంద్రబాబుకు అందచేశారు. ఆ తరువాత జపాన్ రంగంలోకి దిగింది. రాజధాని లేఅవుట్ డిజైన్‌ను ఆ దేశానికి చెందిన మాకీ సంస్థ తయారు చేసింది.
మాకీతోపాటు యుకేకి చెందిన రోజర్స్ సంస్థ, మన దేశానికి చెందిన వాస్తుశిల్ప సంస్థ కూడా డిజైన్లను తయారు చేసింది. వీటిలో యుకెకి చెందిన డిజైన్లు చాలా బాగున్నాయని అంతా భావించారు. దీని తరువాత వాస్తుశిల్ప ఇచ్చిన డిజైన్లు అద్భుతంగా ఉన్నాయన్న అంతా అన్నారు. ఎవ్వరికీ నచ్చని మాకీ డిజైన్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంపిక చేయడం పట్ల అప్పట్లోనే విమర్శలు వెల్లువెత్తాయి. పైగా మాకీ ఇచ్చిన అసెంబ్లీ భవన డిజైన్ చండీగడ్ అసెంబ్లీ మాదిరి ఉందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వినిపించాయి. దీంతో చంద్రబాబు నాయుడు అడుగు వెనక్కు వేసి మాకీ డిజైన్లలో మార్పులు చేయడానికి నిర్ణయించుకుని, మళ్లీ మన ఆర్కిటెక్ట్‌లను పిలిపించుకున్నారు. విజయవాడలో సోమవారం జరిగిన ఆర్కిటెక్ట్‌ల సమావేశంలో అద్భుత డిజైన్లను చూపించారు. ప్రభుత్వం నిర్దేశించిన సమయానికి కొంత అటు, ఇటుగా భవనాలను నిర్మించి ఇస్తామని కూడా చెపుతున్నారు. వాస్తుశిల్ప సంస్థ ఇచ్చిన డిజైన్లు మన దేశ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా ఉన్నాయి. అయితే ఆ సంస్థ ఇచ్చిన డిజైన్లను యథాతథంగా నిర్మించాలంటే చాలా సంవత్సరాలు పడుతుందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ఈ డిజైన్లలో కొంత మార్పు చేసి ఆమోదించి ఉంటే, చంద్రబాబు భారత ఆర్కిటెక్ట్‌లను గౌరవించినట్టయ్యేది. మన దేశ ఆర్కిటెక్ట్‌లను నమ్మకుండా విదేశీయ99లను నమ్ముకోవడం వలన రాజధాని నిర్మాణం మరో ఆరు నెలలు వాయిదా పడిందనడంలో ఏమాత్రం సందేహం లేదు. సమయం, డబ్బు వృధా అయినప్పటికీ తిరిగి మాకీ సంస్థనే కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తోంది. మాకీని కొనసాగిస్తే, వారు ఈ డిజైన్ తయారు చేసి ఇచ్చినందుకు 94 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇటువంటి పెద్ద పెద్ద ప్రాజెక్ట్‌లు వారికి ఇవ్వకపోతే, భవిష్యత్‌లో జపాన్ నుంచి రుణం అందకపోవచ్చన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరిస్తోందని తెలుస్తోంది. ఇదిలా ఉండగా రాజధాని మాస్టర్ డవలపర్‌ను కూడా ప్రభుత్వం ఇప్పటికీ ఖరారు చేయలేదు. ఇందుకోసం స్విస్ ఛాలెంజ్ విధానాన్ని ప్రభుత్వం అనుసరిస్తోంది. మాస్టర్ డవలపర్‌గా సింగపూర్‌ను తీసుకునేందుకు ఇప్పటికీ అంతర్గత ఒప్పందాలు జరిగాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే జరిగితే, రాజధాని అమరావతిలో కేవలం ఒక్క భవనం కూడా ఇండియన్ ఆర్కిటెక్ట్స్ నిర్మించింది ఉండదు! ఇది మనకు గర్వకారణమో? అవమానమో? ఆలోచించాల్సిన అవసరం ఉంది.
ప్రజలకు తెలియని ప్రణాళికలు
అమరావతి లేవుట్‌కు సంబంధించి యుకే, జపాన్, అహ్మదాబాద్‌కు చెందిన వాస్తుశిల్ప సంస్థ ఇచ్చిన డిజైన్లను విజయవాడలోని ఓ హోటల్‌లో ప్రదర్శనకు ఉంచారు. వీటిని రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు పంపించి ప్రజాభిప్రాయాన్ని సేకరించామని మంత్రి నారాయణ చెప్పుకొస్తున్నారు. ఐదు కోట్ల మంది అభిప్రాయాలను తెలుసుకునే మాకీ డిజైన్లను ఎంపిక చేసామని ఆయన చెప్పారు. అయితే, ఈ డిజైన్ల గురించి రాష్ట్రంలో ఎంతమందికి తెలుసు?
chitram వాస్తుశిల్ప సంస్థ ఇచ్చిన డిజైను