ఆంధ్రప్రదేశ్‌

‘కృష్ణ’ విలాపం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 11: గత పదేళ్ళ కాలంలో ఎన్నడూ లేని విధంగా కృష్ణా నది ఎండిఎండిపోయంది. విభజన తరువాత తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాలు పంతాలకుపోయి, నీటిని ఇష్టానుసారంగా వాడుకోవడం వలన ఇప్పుడు రిజర్వాయర్లు నేడు ఎండిపోయే పరిస్థితి వచ్చింది. ఈ ఘోర తప్పిదం వలన నేడు కృష్ణా డెల్టాలో పంటలకే కాదు, తాగడానికి కూడా నీరు లేని పరిస్థితి నెలకొంది. కృష్ణా నదిలో పుష్కలంగా నీరు ఉన్నప్పుడు డెల్టాలో రబీ, ఖరీఫ్ సాగు విస్తృతంగా జరిగేది. 2014-15లో రబీకి నీరు ఇచ్చే పరిస్థితి లేదు. అయినప్పటికీ తెలంగాణలో సుమారు నాలుగు లక్షల ఎకరాలు, ఆంధ్ర ప్రదేశ్‌లో సుమారు 70 వేల ఎకరాల్లో రైతులు రబీ పంటలు వేసుకున్నారు. రబీకి సరిపడా నీరు రిజర్వాయర్లలో లేదని తెలిసి కూడా ప్రభుత్వాలు నీటిని విడుదల చేయాలన్న పట్టుదలకు వచ్చాయి. తెలంగాణ ప్రభుత్వం 150 నుంచి 160 టిఎంసిల నీటిని రబీ పంట కోసం, మరో 44 టిఎంసిల నీరు తాగునీటి అవసరాల కోసం వెరసి 194 టిఎంసిల నీటిని 2014-15లో వాడుకుంది. అదేవిధంగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం సుమారు 190 టిఎంసిల నీటిని వాడుకుంది. వాస్తవానికి శ్రీశైలం, నాగార్జునసాగర్ రిజర్వాయర్లలో మిగులు నీటిని క్యారీ ఫార్వర్డ్ అంటే వచ్చే సంవత్సరం ఖరీఫ్, తాగునీటి అవసరాలకు వినియోగించుకోవాలని బచావత్ ట్రిబ్యునల్ చెప్పింది. కానీ 2014-15లో ఈ ట్రిబ్యునల్ ఆదేశాలను ఖాతరు చేయకుండా, ముందు చూపు లేకుండా ఇరు రాష్ట్రాలు పోటీ పడి కృష్ణా జలాలను వాడేసుకుని నీటి కష్టాలను కొని తెచ్చుకున్నాయి. తెలంగాణ ప్రభుత్వం కృష్ణా నీటిని వాడుకుంటోందని చెప్పి, మన రాష్ట్ర ప్రభుత్వం కూడా నీటిని అనవసరంగా రబీకి ఇచ్చింది. ఈ నీటి కోసం అప్పుడు ఇరు రాష్ట్రాల ప్రతినిధులు గవర్నర్ వద్ద కూర్చుని మరీ నీటి పంపకాలు జరిపించుకున్నారు. దీంతో శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాల్లో నీరు అడుగంటిపోయింది. దీనికితోడు 2015లో వర్షాభావ పరిస్థితులు ఏర్పడడంతో ఈ రెండు జలాశయాల్లో నీరు కనిష్ఠ స్థాయికి చేరుకుంది.
పట్టిసీమ నీరు రావాలంటే..
కృష్ణా, గోదావరి నదులను అనుసంధానం చేసి, పట్టిసీమ ద్వారా గోదావరిలో మిగులు నీటిని కృష్ణకు తరలించాలని ముఖ్యమంత్రి ఓ మహత్తర కార్యాక్రమాన్ని చేపట్టారు. జూలై, ఆగస్ట్ నెలల్లో గోదావరికి వరదలు వస్తాయి. ఆ నీటిని కృష్ణకు పట్టిసీమ ద్వారా తరలించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. కానీ ఈ ఏడాది ఆ పరిస్థితులు కనిపించడం లేదు. పట్టిసీమ నుంచి కృష్ణకు నీటిని తరలించాలంటే ముందు పోలవరం కుడి కాలువ సిద్ధం కావాలి. ఇప్పటి నుంచి యుద్ధ ప్రాతిపదికన పోలవరం కుడి కాలువ పనులు చేపట్టినా, ఈ ఏడాది చివరి నాటికి కూడా పనులు పూర్తయ్యే పరిస్థితులు లేవు. పోలవరం కుడి కాలువ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే రోజుకు 17 వేల క్యూసెక్కుల నీటిని కృష్ణకు తరలించడానికి అవకాశం ఉంటుంది. పోలవరం కుడి కాలువ పూర్తి కాలేదు కాబట్టి, అంతంతమాత్రంగా ఉన్న కాలువ నుంచైనా జులై, ఆగస్ట్ నెలల్లో రోజుకు 8,500 క్యూసెక్కుల నీటిని తరలిద్దామని ప్రభుత్వం భావిస్తోంది.