ఆంధ్రప్రదేశ్‌

ప్రత్యేక హోదా సాధనలో బాబు విఫలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చీడికాడ, మే 14: రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావడంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు విఫలం చెందారని పిసిసి అధ్యక్షులు ఎన్.రఘువీరారెడ్డి ఆరోపించారు. విశాఖపట్నం జిల్లా చీడికాడలో శనివారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్రాన్ని విభజించమని మొట్టమొదట సంతకం చేసింది చంద్రబాబునాయుడేనని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రధానమంత్రికి రాసిన లేఖలో ప్రత్యేకహోదా అంశం ప్రస్తావించలేదని బిజెపి నాయకుడు సిద్దార్ధ్‌సింగ్ శుక్రవారం చేసిన ప్రకటనను బట్టి చూస్తే రాష్ట్రానికి ప్రత్యేకహోదా రావడం బాబుకు ఇష్టం లేదని స్పష్టమవుతోందన్నారు. అన్ని పార్టీలు రాష్ట్రాన్ని విభజించమంటేనే కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ తుది నిర్ణయం తీసుకున్నారే తప్ప దీంట్లో కాంగ్రెస్ పాత్ర ఏమీలేదన్నారు. ఆరోజు పార్లమెంట్ సాక్షిగా ప్రధానిమంత్రి మన్మోహన్‌సింగ్ రాష్ట్రాన్ని విభజిస్తే ఐదేళ్లు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారన్నారు. అయితే ప్రత్యేక హోదా ఐదేళ్లు సరిపోదని, పదేళ్లు కావాలని రాజ్యసభలో వెంకయ్యనాయుడు డిమాండ్ చేశారన్నారు. గత ఎన్నికల సమయంలో హోదాపై నరేంద్రమోదీతో చంద్రబాబు హామీ తీసుకున్నారని ఆయన గుర్తుచేశారు. పార్లమెంట్ సాక్షిగా జరిగిన ప్రకటనలను ఈ ప్రభుత్వం నీరుగార్చిందని రఘువీరా ఆరోపించారు. తెలంగాణలో ఓటుకు నోటు కేసులో దొరికిపోవడంతో ఎక్కడ జైలుకు వెళ్లాల్సివస్తుందోననే భయంతో ప్రత్యేకహోదా ఇవ్వమని బాబు కేంద్రాన్ని గట్టిగా డిమాండ్ చేయడం లేదని రఘువీరా ఆరోపించారు. పాదయాత్ర నిర్వహించినపుడు తెలంగాణ పర్యటనలో తెలంగాణకు అనుకూలమని, ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నప్పుడు సమైక్యవాదమని బాబు ప్రకటన చేశాడన్నారు. విభజన జరిగినప్పుడు కేంద్రం ఆంధ్రప్రదేశ్‌కు రూ.5 లక్షల కోట్లు కేటాయించిందన్నారు. ప్రత్యేకహోదా గురించి చట్టంలో రూపొందించారన్నారు. కేంద్ర కేబినెట్ సిఫార్సు మేరకు ప్రత్యేక హోదా ఇవ్వవచ్చని, ఆ అధికారం కేంద్రానికి ఉందని అన్నారు.