ఆంధ్రప్రదేశ్‌

పోలవరంపై శే్వతపత్రం కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఆగస్టు 12: రాష్ట్ర విభజన చట్టం నిబంధన మేరకు పోలవరం ప్రాజెక్టుకయ్యే ప్రతీ పైసా ఖర్చూ కేంద్రమే భరించి నిర్మించాల్సి ఉందని, ఈ చట్టం నిబంధనకు విరుద్ధంగా కేంద్రం వ్యవహరిస్తున్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నోరు మెదప లేకపోతున్నారని మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్‌కుమార్ ఆరోపించారు. ఆగస్టు చివరి నాటికైనా పోలవరం ప్రాజెక్టుపై శే్వత పత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. శనివారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. 2013లో ట్రాన్స్‌స్ట్రాయ్‌తో జరిగిన అగ్రిమెంట్ ప్రకారం 2018 నాటికి పోలవరం పనులు పూర్తి చేయకపోతే ఈ ప్రాజెక్టు కోసం రూ.1981.54 కోట్ల గ్రాంటు కాస్తా రుణంగా పరిగణించాల్సి ఉంటుందని కేంద్రం నిబంధన పెట్టినప్పటికీ చంద్రబాబు మాట్లాడటం లేదని ధ్వజమెత్తారు. పురుషోత్తపట్నం, పట్టిసీమకు రాష్ట్రం ఖర్చు చేసిన సుమారు రూ.4 వేల కోట్ల నిధులు పోలవరం కోసం ఖర్చు చేసి వుంటే హెడ్ వర్క్సు పూర్తయ్యేవన్నారు. ఇటీవల పోలవరం పనులను పరిశీలించడం జరిగిందని, కనీసం పనులు ముందుకు కదలడం లేదని స్పష్టమవుతోందని, ఏదో ముఖ్యమంత్రి వచ్చిన రోజు మాత్రం పనులు జరుగుతున్నట్టు లారీల హడావిడి కనిపిస్తోందని ఆరోపించారు. పట్టిసీమ ప్రాజెక్టు వల్ల కొత్తూరు చెరువుకు నీళ్లివ్వడం లేదని రైతులు ఆందోళన చేస్తున్నారని, ఈ విషయం జల వనరుల శాఖ మంత్రికి తెలియదా? అని ఉండవల్లి ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి 2016 డిసెంబర్ 23న జారీ అయిన జీవో ప్రకారం రూ.1981.54 కోట్లు కేటాయించడం జరిగిందని, 2018 మార్చి 31లోగా పూర్తి చేయాలని, ఈ గడువు దాటితే గ్రాంట్ కాస్తా రుణంగా మారుతుందని స్పష్టంగా ఆ జీవోలో పేర్కొనడం జరిగిందని ఉండవల్లి వివరించారు. విభజన చట్టం ప్రకారం కేంద్రమే నిర్మిస్తుందని చెబితే చంద్రబాబు ఎందుకు తనమీద వేసుకున్నారని ప్రశ్నించారు. గడువులోగా పూర్తికాకపోతే రుణంగా మారుతుందని మెలిక పెట్టడం చూస్తుంటే అసలు పోలవరం పూర్తవుతుందా అనే అనుమానం కలుగుతోందన్నారు. పోలవరం నిర్మాణానికయ్యే ప్రతీ పైసా కేంద్రమే భరించాల్సి ఉందని, పెంపు విషయంలో అధారిటీ ఆమోదం లేకుండా పెంపుదల కుదరదన్నారు. చల్లపల్లి మండలం మేకావారిపాలెం దివి సమీపంలో కొంత మంది రైతులు పట్టిసీమ జలాలతో సాగు చేసుకుంటున్నట్టు తన పేరుతో ఫ్లెక్సు పెట్టారని, అయితే ఆ పక్కనే పొలాలకు నీరందనిస్థితి కూడా వాట్సాప్‌లో తనకు పోస్టింగ్ వచ్చిందని రెండు ఫొటోలను ఉండవల్లి చూపించారు. సమావేశంలో నాయకులు నక్కా శ్రీనగేష్, అచ్యుత దేశాయ్, చెరుకూరి వెంకటరామారావు తదితరులు పాల్గొన్నారు.

చిత్రం.. విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న మాజీ ఎంపి ఉండవల్లి