ఆంధ్రప్రదేశ్‌

పార్టీలన్నీ ఐక్యంగా పోరాడితేనే హోదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ద్వారకాతిరుమల, మే 14: రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలూ కలిసికట్టుగా పోరాడితేనే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధ్యమవుతుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి పి అశోక్ గజపతిరాజు అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమల చిన వెంకన్న ఆలయాన్ని సందర్శించిన అనంతరం శేషాచల కొండపై అతిథిగృహంలో ఆయన విలేఖర్లతో మాట్లాడారు. చిన వెంకన్న ఆలయ అభివృద్ధి బాగా జరిగిందని కితాబునిచ్చారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాకోసం పార్టీలకు అతీతంగా ప్రతిఒక్కరూ పోరాడాలని సూచించారు. ఫైనాన్స్ కమిషన్ నివేదికను పరిశీలిస్తే రాష్ట్ర విభజనలో ఎన్నో సమస్యలు ఉన్నట్టు స్పష్టమైందన్నారు. మనల్ని కట్టుబట్టలతో బయటకు పంపించారని, కాస్త కష్టపడాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రస్తుత ఫైనాన్స్ కమిషన్‌ను పరిశీలిస్తే తెలంగాణా రాష్ట్రం రూ.1.18 లక్షల కోట్ల మిగులు బడ్జెట్‌లో ఉంటే ఆంధ్రప్రదేశ్ రూ.23 వేల కోట్ల లోటు బడ్జెట్‌లో ఉందన్నారు. దేశంలో బీహార్, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఆర్థికంగా వెనుకంజలో ఉన్నాయని మంత్రి చెప్పారు. అశాస్ర్తియంగా జరిగిన విభజన నేపధ్యంలో రాష్ట్రం అభివృద్ధి చెందే వరకు కేంద్రం చేయూతనివ్వాలని అందరూ కోరుతున్నట్టు తెలిపారు. ఇటీవల అనంతపురం వచ్చిన రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించాలని తమ కేబినెట్ నిర్ణయించినట్టు మాట్లాడారని, అయితే దానిని బిల్లులో ఎందుకు పెట్టలేదని ఆయన ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వంలో సైతం నిధులు తక్కువగా ఉండటం వల్ల స్కీమ్‌లు తగ్గాయన్నారు. అయినా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం పాటుపడుతోందని చెప్పారు. రాష్ట్రంలో ఉన్న ప్రజాప్రతినిధులందరూ పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలనే కోరుకుంటున్నారని, అది పూర్తయితే కరువనే మాట ఉండదన్నారు. ప్రస్తుత వేసవిలో విద్యుత్ కోతలు లేవని, దీనిని బట్టి ప్రభుత్వం ఎంతబాగా పనిచేస్తుందో అర్థమవుతోందని అశోక్ గజపతిరాజు చెప్పారు.

చిత్రం విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతున్న కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు