రాష్ట్రీయం

తీవ్ర సంక్షోభంలో రైతాంగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 3: దేశంలో రైతాంగం తీవ్రమైన సంక్షోభంలో చిక్కుకుందని, రైతుల ఆత్మహత్యలను తాత్కాలిక ఉపశమన చర్యల ద్వారా నిరోధించలేమని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి అన్నారు. గురువారం ఇక్కడ ఆయన అఖిల భారత రైతు సంఘం (ఏఐకెఎస్) 29వ జాతీయ మహాసభలను ప్రారంభించారు. ఈ సందర్భంగా సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ రాజ్యాంగంలో పొందుపరిచిన ఆదేశిక సూత్రాలు రాజ్యాంగ స్ఫూర్తితో అమలు కానంతవరకు రైతాంగ సంక్షోభం కొనసాగుతుందన్నారు. రైతుల ముఖాల్లో సంతోషం చూసినప్పుడే ఏ దేశమైనా బాగుంటుందన్నారు. తాను ఒక రైతునని, మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చానని, గ్రామాల్లో రైతుల పరిస్థితులు దారుణంగా ఉన్నాయన్నారు. అప్పుల ఊబిలో చిక్కుకుని వ్యవసాయం చేయలేక, దెబ్బతింటున్న పంటలను కాపాడుకోలేక ఆత్మహత్యలే శరణ్యమంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో ప్రతి 30 నిమిషాలకు ఒక రైతు ఆత్మహత్య నమోదవుతోందని అన్నారు. కార్పొరేట్ సంస్థలు, బహుళ జాతి సంస్థలకు వ్యవసాయ భూములను కట్టబెట్టే విధానాలను ప్రభుత్వాలు మానుకోవాలన్నారు. పెట్టుబడిదారుల చేతుల్లో వనరులు కేంద్రీకృతమయ్యాయన్నారు. ఆధిపత్య భావజాలానికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన తరుణం ఆసన్నమైందన్నారు. రాజ్యాంగ సంవిధానంపై విశ్వాసం ఉన్నవాళ్లు ఏకతాటిపైకి రావాలన్నారు.
అఖిల భారత రైతు సంఘం అధ్యక్షుడు ప్రబోధ్ పాండా మాట్లాడుతూ జై జవాన్, జై కిసాన్, గరీబీ హఠావో, కిసానోంకీ ఆజాదీ నినాదాలు నినాదాలుగా మిగిలిపోయాయన్నారు. గత పది సంవత్సరాల్లో మూడు లక్షల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. స్వామినాథన్ కమిటీ నివేదికను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. మోదీ సర్కార్ రైతాంగ హక్కులను హరించి వేస్తోందన్నారు. హైదరాబాద్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ రైతాంగం తీవ్ర వివక్షకు గురవుతోందని, రైతులు అప్పుల్లో మునిగిపోతున్నారన్నారు. రైతు సంఘం ఉపాధ్యక్షుడు కొల్లి నాగేశ్వరరావు మాట్లాడుతూ బిటి కాటన్ విత్తనాలకు వ్యతిరేకంగా కోర్టుల్లో కేసులు వేసి కిలో రూ.1850 ఉన్న విత్తనాల ధరను రూ.700కు తగ్గించామని, తద్వారా తెలుగు రాష్ట్రాల్లో రైతులపై మూడువేల కోట్ల భారం తగ్గిందన్నారు. అఖిల భారత రైతు సంఘం ప్రధాన కార్యదర్శి అతుల్‌కుమార్ అంజన్ సంఘం అజెండాను వివరించారు. రైతు సంఘం నేతలు గుర్రం యాదగిరి రెడ్డి, జాతీయ ఉపాధ్యక్షుడు రావుల వెంకయ్య, ఏపి రైతు సంఘం అధ్యక్షుడు రామచంద్రయ్య, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి పాల్గొన్నారు.

గురువారం హైదరాబాద్‌లో అఖిల భారత రైతు సంఘం (ఏఐకెఎస్)
29వ జాతీయ మహాసభలను ప్రారంభించి ప్రసంగిస్తున్న
సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్‌రెడ్డి