ఆంధ్రప్రదేశ్‌

కృష్ణా జలాల కోసం సుప్రీం కోర్టుకు వెళ్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 21: రాష్ట్రానికి రావాల్సిన కృష్ణా జలాలను అడ్డుకుంటున్న కర్నాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలపై న్యాయపోరాటానికి దిగుతున్నట్టు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ గాని, పబ్లిక్ ఇంట్రెస్ట్ పిటిషన్ గాని వేయడానికి న్యాయనిపుణులను సంప్రదిస్తున్నామన్నారు. వెలగపూడి సచివాలయంలో సోమవారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జూన్, జూలై, ఆగస్టు నెలలో కురిసిన వర్షాలకు కృష్ణానదిలో వచ్చిన 275 టిఎంసిలను మహారాష్ట్ర, కర్నాటక ప్రభుత్వాలు అడ్డుకున్నాయన్నారు. ఎగువ రాష్ట్రాల నుంచి ఒక్క టిఎంసి కూడా రాలేని పరిస్థితి నెలకొందన్నారు. ట్రిబ్యునల్స్ పేరుతో ఆ నీటిని ఇష్టారాజ్యంగా వాడుకుంటున్నాయన్నారు. తమ రాష్ట్ర పరిధిలో ఉన్న డ్యాముల్లో, రిజర్వాయర్లలో నిండుగా నీరు నిల్వ చేసుకుంటున్నాయన్నారు. ఏపి, తెలంగాణాలో తాగునీటి అవసరాలకు మానవతా దృక్పథంతో గానీ, నీటి హక్కుల్లో భాగంగా గానీ చుక్కనీరు కూడా వదలడం లేదన్నారు. ఇదే విషయాన్ని ఇప్పటికే కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతితో పాటు కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లామన్నారు. దీనిపై న్యాయపరంగా చర్యలు తీసుకోడానికి సిద్ధమవుతున్నామన్నారు. సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్‌గాని, పబ్లిక్ ఇంట్రెస్ట్ పిటిషన్ గాని వేయడానికి న్యాయ నిపుణులను సంప్రదిస్తున్నామన్నారు. రాష్ట్రానికి వీలైనంత తొందరగా కృష్ణా జలాలను తీసుకురావడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. ఇంతవరకూ కర్నాటకలో 471 మిల్లీమీటర్లు, మహారాష్టల్రో 655 మిల్లీమీటర్లు వర్షం కురిసిందని, ఆ నీటినంతా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తమ డ్యాముల్లో నింపుకున్నాయని అన్నారు.