ఆంధ్రప్రదేశ్‌

ఆరోగ్య భారత్ ఎన్‌డిఏ లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఆగస్టు 22: ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూస్తున్నాయి.. ఏ దేశంలోలేని సంక్షేమ పథకాలను కేంద్రప్రభుత్వం అమలుచేస్తోంది.. వచ్చే ఐదేళ్లలో అందరికీ ఆహారం.. ఆరోగ్య భద్రత..పేదరిక నిర్మూలన..అవినీతిరహిత దేశంగా నవభారత నిర్మాణమే సంకల్పమని కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి జగత్‌ప్రకాష్ నడ్డా అన్నారు. మంగళవారం గుంటూరు జిల్లాలో పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. తొలుత తాడికొండలో రూ. 4కోట్లతో నిర్మించిన గ్రామీణ ఆరోగ్య కేంద్రాన్ని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌తో కలసి ప్రారంభించారు. అనంతరం హిందూ ఫార్మసీ కళాశాలలో ‘సంకల్పసిద్ధి’ నవభారత నిర్మాణం సదస్సులో కేంద్రమంత్రి ప్రసంగించారు. భారతదేశ సుదీర్ఘకాల పయనంలో ఇప్పటి వరకు అవినీతి, పేదరికం, నిరక్షరాస్యతతో తల్లడిల్లింది..గడచిన మూడేళ్లలో అనిర్వచనీయ మైన మార్పులు చోటుచేసుకున్నాయి..
అభివృద్ధిచెందిన దేశాల సరసన భారత్ చేరింది.. ఈ మార్పు కేంద్ర ప్రభుత్వ విధానాల వల్లే సాధ్యమైందన్నారు. అమెరికా అధ్యక్షుడిని ఎన్నుకోవటంలో కీలకపాత్ర భారతీయులదే అన్నారు. చైనాతో సౌహార్ద్ర సంబంధాలనే కేంద్రం కోరుకుంటుందోని చెప్పారు. అయితే కవ్వింపు చర్యల వల్ల సత్సంబంధాలు బెడిసికొడుతున్నా యని తెలిపారు. చైనా, జపాన్, జర్మనీ వంటి దేశాలు భారత్‌లో పెట్టుబడులకు సుముఖత వ్యక్తం చేయటం ఎన్డీయే పాలనా విధానాలకు నిదర్శన మన్నారు. దేశవ్యాప్తంగా 12 కోట్ల మంది రైతులకు గాను 3 కోట్ల మందికి సాయిల్ హెల్త్ కార్డులు పంపిణీ చేశామన్నారు. 18వేల గ్రామాలకు విద్యుద్దీకరణ జరిగిందన్నారు. యూనివర్సల్ హెల్త్ స్క్రీనింగ్ కింద వంద జిల్లాలను ఎంపిక చేశామన్నారు. ఆరోగ్యనిధితో 30 ఏళ్లు పైబడిన క్యాన్సర్, బిపి, సుగర్‌కు ఉచిత వైద్యంతో పాటు మందులు పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. దేశవ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సేవలు విస్తృతం చేస్తామన్నారు.
వచ్చే ఏడాది ఎయిమ్స్‌లో తరగతులు
వచ్చే ఏడాది నుంచి మంగళగిరి ఎయిమ్స్‌లో తరగతులను ప్రారంభించనున్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ తెలిపారు. కేంద్రం 16వందల కోట్ల నిధులు వైద్య, ఆరోగ్యానికి మంజూరు చేస్తోందని చెప్పారు. మహాప్రస్థానం సేవలు దేశంలో ఎక్కడా లేవన్నారు.

చిత్రం..‘సంకల్పసిద్ధి’ నవభారత నిర్మాణం సదస్సులో మాట్లాడుతున్న కేంద్రమంత్రి నడ్డా