ఆంధ్రప్రదేశ్‌

తప్పుడు లెక్కలతో తప్పించుకునే యత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రత్తిపాడు, ఆగస్టు 22: రాష్ట్రంలో కాపులు ఆస్తిపరులని, ఉన్నత విద్యావంతులని, ఉద్యోగాలు కూడా ఎక్కువ సంఖ్యలో చేస్తున్నారని, 40 లక్షలకు మించి కాపులు ఉండరని తప్పుడు లెక్కలు, గుడ్డి గణాంకాలతో నడ్డివిరిచే ప్రయత్నం చేస్తున్నారని కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం అన్నారు. 28వ రోజు మంగళవారం కూడా ముద్రగడ పాదయాత్రను ఆయన ఇంటి గేటు వద్ద పోలీసులు నిలిపివేశారు. భారీ సంఖ్యలో మహిళలు, కాపు జెఎసి నాయకులతో ఆయన ఇంటి గేటు వద్ద నిరసన తెలియచేస్తూ బైఠాయించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాపుల గణాంకాలపై కొన్ని పత్రికల్లో వస్తున్న వార్తల వెనుక ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హస్తం ఉందని, మరోసారి కాపులను మోసగించేలా ఉన్నారన్నారు. ఈ నేపథ్యంలో రాష్టవ్య్రాప్తంగా కాపులు నివసించే అన్ని ప్రాంతాల్లో నిరసన కార్యక్రమాలు ముమ్మరం చేయాలని పిలుపునిచ్చారు. అందరూ రెండు నెలలు నిరసన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఎన్నికల్లో చంద్రబాబునాయుడు కాపులకు ఇచ్చిన హామీనే అమలుచేయాలని కాపుజాతి రోడ్డెక్కి ఆందోళన చేస్తోందన్నారు. సుమారు 15 లక్షల మందికి పైగా తుని ఐక్య గర్జన సభ ద్వారా తమ ఆకలి కేకను ప్రభుత్వానికి విన్పించారని, దీనినిబట్టి వారు ఎంత వెనుకబడి ఉన్నారో ముఖ్యమంత్రి గమనించలేని స్థితిలో లేరని, కావాలనే కాపులను మోసగించేందుకు కుట్ర పన్నుతున్నారని ముద్రగడ ఆరోపించారు. తనను గెలిపిస్తే బిసి రిజర్వేషను ఇస్తామన్న పెద్దమనిషి కాపులందరూ ఆస్తిపరులేనని చిత్రీకరించడం జాతి గమనిస్తోందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పదవీకాలం మూడేళ్లు గడిచిందని, ఇప్పుడైనా కళ్లు తెరిచి కాపులకు ఇస్తామన్న హామీ ప్రకారం రిజర్వేషను ఇవ్వాలని, దీనిని గుర్తుచేయడానికి అమరావతి వరకు పాదయాత్ర తలపెడితే పోలీసులతో ఉద్యమాన్ని అణగదొక్కించే కార్యక్రమం చేస్తున్నారన్నారు. ఇప్పుడు రిజర్వేషన్ సాధించుకోకపోతే జాతి అంతరించిపోతుందని ముద్రగడ ఆందోళన వ్యక్తంచేశారు. కఉభయ గోదావరి జిల్లాలకు చెందిన మహిళలు, కాపు సంఘాల నాయకులు ముద్రగడకు సంఘీభావం తెలిపారు. సాయంత్రం వరకు వారంతా శిబిరంలోనే ఉన్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఉండ్రాజవరం, తణుకు, పాలకొల్లు, దువ్వ, తాడేపల్లిగూడెం నుండి వేమన శ్రీనివాసు, కోటపల్లి సుబ్రహ్మణ్యం, తోట సూర్యనారాయణ, గురజాల సత్యనారాయణ, బండి పోతురాజు, రావులపాలెం టిడిపి నాయకుడు తాతారావు, డిసిసిబి మాజీ చైర్మన్ ఆకాశం శ్రీరామచంద్రమూర్తి ముద్రగడకు సంఘీభావం తెలిపిన వారిలో ఉన్నారు.